Municipal Elections: ముగిసిన ప్రచార పర్వం.. 11న పోలింగ్.. వివరాలు ఇలా.!
- తెలంగాణలో ముగిసిన మున్సిపల్ ఎన్నికల ప్రచారం
- 7 కార్పొరేషన్ల పరిధిలో 414 వార్డు డివిజన్లకు ఎన్నికలు
- 116 మున్సిపాలిటీల్లోని 2,582 వార్డులకు పోలింగ్
- ఎన్నికల బరిలో 12,993 మంది అభ్యర్థులు
- మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో 52,43,023 మంది ఓటర్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Telangana municipal elections 2026 : తెలంగాణ రాష్ట్రంలోని పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రచార పర్వం ముగిసింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 116 మున్సిపాలిటీలు , 7 మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో ఎన్నికల ప్రచారానికి తెరపడింది. అధికార , ప్రతిపక్ష పార్టీలు తమ సత్తా నిరూపించుకునేందుకు ఈ ఎన్నికలను సెమీఫైనల్స్‌గా భావిస్తున్నాయి. అగ్రనేతల పర్యటనలు, రోడ్ షోలు, ఇంటింటి ప్రచారంతో ఇన్నాళ్లూ మార్మోగిన వీధులన్నీ ఇప్పుడు నిశ్శబ్దంగా మారాయి. ఫిబ్రవరి 11న జరగనున్న పోలింగ్‌లో ఓటర్లు ఎవరికి పట్టం కడతారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
Samsung 55inch TV Offer: రూ.81,900 టీవీ ఇప్పుడు కేవలం రూ.45,990లకే.! టాప్ ఫీచర్స్ కూడా..!
Also Read
- Harish Rao: నిరుద్యోగులపై ఎందుకింత కక్ష? సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి హరీశ్ రావు ఫైర్
- Hyderabad: స్టేడియం వద్ద కిక్కిరిసిన నిరుద్యోగులు.. హైడ్రా ఉద్యోగాల కోసం క్యూ కట్టిన వేలాది మంది!
- CM Revanth Reddy: రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మార్చేలా వ్యూహం.. సీఎం రేవంత్, అరవింద్ సుబ్రమణియన్ చర్చలు..
- Fake Certificates: ఇదేం మోసం బాబోయ్.. ఒకే వ్యక్తికి రెండు ప్రభుత్వ ఉద్యోగాలు..
ఈ ఎన్నికల్లో ఓటర్ల బలం గణనీయంగా ఉంది. మొత్తం 123 పట్టణ స్థానిక సంస్థల పరిధిలో 2,996 వార్డులు, డివిజన్లకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి మొత్తం 52,43,023 మంది ఓటర్లు సిద్ధంగా ఉన్నారు. ఇందులో పురుష ఓటర్ల సంఖ్య 25,62,639 కాగా, 26,80,014 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. పురుషుల కంటే మహిళా ఓటర్ల సంఖ్య ఎక్కువగా ఉండటం ఈ ఎన్నికల్లో కీలక పరిణామంగా కనిపిస్తోంది. వీరితో పాటు మరో 640 మంది ఇతర ఓటర్లు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.
ఎన్నికలను నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం పటిష్టమైన ఏర్పాట్లు చేసింది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 8,195 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. బ్యాలెట్ పద్ధతిలో జరిగే ఈ ఎన్నికల కోసం 16,031 బ్యాలెట్ బాక్స్‌లను సిద్ధం చేశారు. పోలింగ్ ప్రక్రియను పర్యవేక్షించేందుకు 1,379 మంది రిటర్నింగ్ ఆఫీసర్లు (RO), 1,547 మంది సహాయ రిటర్నింగ్ ఆఫీసర్లను నియమించారు. క్షేత్రస్థాయిలో 9,560 మంది ప్రిసైడింగ్ ఆఫీసర్లు (PO), 31,428 మంది ఇతర సిబ్బంది విధుల్లో పాల్గొంటున్నారు. ఎన్నికల అనంతరం బ్యాలెట్ బాక్స్‌లను భద్రపరచడానికి 137 స్ట్రాంగ్ రూమ్‌లు, ఫలితాల లెక్కింపు కోసం 136 కౌంటింగ్ కేంద్రాలను సిద్ధం చేశారు.
ఎన్నికల సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రభుత్వం భారీ భద్రతను ఏర్పాటు చేసింది. సుమారు 25,000 మంది పోలీసు సిబ్బందితో రాష్ట్రవ్యాప్తంగా నిఘా పెంచారు. ముఖ్యంగా సమస్యాత్మక ప్రాంతాలుగా గుర్తించిన పోలింగ్ కేంద్రాల వద్ద అదనపు బలగాలను మోహరించారు. ఎన్నికల ప్రక్రియలో పూర్తి పారదర్శకతను పాటించేందుకు ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద వెబ్ కాస్టింగ్ సదుపాయాన్ని కల్పించారు. దీని ద్వారా ఎన్నికల సంఘం అధికారులు నేరుగా పోలింగ్ సరళిని పర్యవేక్షించవచ్చు. మొత్తం 12,993 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న ఈ ఎన్నికల్లో గెలుపు ఎవరిని వరిస్తుందో చూడాలి.
ఫిబ్రవరి 11న పోలింగ్ ముగిసిన తర్వాత, ఫిబ్రవరి 13న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను ప్రకటిస్తారు. ఆ తర్వాత ఫిబ్రవరి 14న మున్సిపల్ కార్పొరేషన్ మేయర్, డిప్యూటీ మేయర్లతో పాటు మున్సిపల్ చైర్మన్ , డిప్యూటీ చైర్మన్ల ఎన్నిక ప్రక్రియ జరుగుతుంది. చివరగా ఫిబ్రవరి 16న కొత్తగా ఎన్నికైన వార్డు సభ్యుల ప్రమాణ స్వీకారం, ప్రత్యేక సమావేశంతో ఈ ఎన్నికల ప్రక్రియ పూర్తి కానుంది.
తాజావార్తలు
-
PM Modi: భవిష్యత్ భారత్ నిర్మాతలు మీరే.. యువతకు ప్రధాని మోడీ స్ఫూర్తిదాయక సందేశం..
-
APJAC: డీఏలు ఎందుకు ప్రకటించడం లేదు.? ప్రభుత్వ శ్వేతపత్రంపై ఏపీజేఏసీ ఫైర్.!
-
Rishabh Pant: అర్ధరాత్రి సీఎం సాయం కోరిన రిషబ్ పంత్.. స్పందించిన పుష్కర్ సింగ్ ధామి
-
Bharat Bhhagya Viddhaata: తుపాకుల మోతలో ప్రాణాలను పణంగా పెట్టిన రియల్ హీరోలు.. ఓటీటీలోకి ‘భారత్ భాగ్య విధాత’
-
Harish Rao: నిరుద్యోగులపై ఎందుకింత కక్ష? సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి హరీశ్ రావు ఫైర్
ట్రెండింగ్
-
Clothes Smell: వర్షాకాలంలో బట్టల నుంచి దుర్వాసనా.? ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి ఇలా.!
-
1TB వరకు స్టోరేజ్,120Hz డిస్ప్లే, Tensor G6తో Google Pixel 11 సిరీస్.. లాంచ్‌కు ముందే ధరలు లీక్.!
-
Airtel యూజర్లకు షాక్.. రూ.299 ప్లాన్ నిలిపివేత.. ఇక అన్లిమిటెడ్ ప్లాన్ రూ.349 నుంచే మొదలు.!
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్‌తో REDMI 17 5G లాంచ్..!
-
Will Jacks: సూపర్‌మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!