ఎలాన్ మస్క్‌ని ఆహ్వానించిన కేటీఆర్.. ‘టెస్లా’కు మేం రెడీ..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎలక్ట్రిక్ వెహికల్స్‌లో టెస్లాకు ప్రత్యేక స్థానం ఉంది.. ప్రపంచంలోనే పేరుమోసిన సంస్థ టెస్లా.. అధునాతన టెక్నాలజీతో వాహనాలను ప్రవేశపెడుతూ.. ఎప్పటికప్పుడూ కస్టమర్లను ఆకట్టుకుంటుంది. టెస్లా కార్లు భారత్‌కు ఎప్పుడొస్తాయి అనే చర్చ ఎప్పటి నుంచో జరుగుతున్నా.. తాజాగా.. ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు సంస్థ అధినేత ఎలాన్ మస్క్ స్పందించడంతో.. మరోసారి ఈ వ్యవహారం చర్చగా మారింది.. ఇక, సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ.. అనేక అంశాలపై స్పందించే తెలంగాణ మంత్రి కేటీఆర్.. వెంటనే ఈ అంశంపై స్పందించారు.. సోషల్ మీడియా వేదికగా ఎలన్‌మస్క్‌తో టచ్‌లోకి వెళ్లిన కేటీఆర్.. హే ఎలాన్.. నేను భారతదేశంలోని తెలంగాణ రాష్ట్ర పరిశ్రమలు మరియు వాణిజ్య శాఖ మంత్రిని అంటూ పలకరించారు.. ఇండియాకి టెస్లా కనుక వస్తే.. మీతో కలిసి పని చేసేందుకు మేం సిద్ధంగా ఉన్నామంటూ తెలంగాణ రాష్ట్ర ఇండస్ట్రీస్, కామర్స్ మంత్రిగా తెలియజేస్తున్నాను.. ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన అనేక సంస్థలు తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాయని పేర్కొన్నారు.
Read Also: సీఎం జగన్, చిరు భేటీపై స్పందించిన నాగ్.. తప్పకుండా గుడ్‌న్యూస్..!
Also Read
- Kishan Reddy: కాంగ్రెస్ ఓటములకు ఎన్నికల సంఘం ఎలా బాధ్యత వహిస్తుంది? కిషన్‌రెడ్డి ప్రశ్న
- Hyderabad: జైల్లో భర్త.. తనను పెళ్లి చేసుకోవాలని వేధిస్తూ భార్యను హత్య చేసి భర్త ఫ్రెండ్..!
- Harish Rao: రైతులకు ఉచిత విద్యుత్‌కు ఎసరు పెట్టే కుట్ర..? కాంగ్రెస్ ప్రభుత్వంపై హరీష్ రావు ఫైర్
- Onion Prices Down: శుభవార్త.. భారీగా తగ్గనున్న ఉల్లి ధరలు..
అంతే కాదు.. 2016 జూన్ 5వ తేదీన తాను చేసిన ఓ ట్వీట్‌ను రీట్వీట్ చేశారు కేటీఆర్… ఆ ట్వీట్ ఏంటంటే..? గతంలో టెస్లా కారుని స్వయంగా నడిపారు కేటీఆర్.. ప్రపంచ వ్యాప్తంగా అందరి నోళ్లలో నానుతున్న టెస్లా మోడల్ ఎక్స్ కారుని అమెరికాలో ఓ ట్రయల్ వేసిన కేటీఆర్.. కారు బాగుంది.. కొత్తగా ఆలోచించిన ఎలాన్ మస్క్‌కి అభినందనలు తెలుపుతూ.. ఓ ట్వీట్ చేశారు.. ఆ ట్వీట్‌నే ఇప్పుడు రిట్వీట్ కూడా చేశారు కేటీఆర్.. కాగా, ప్రణయ్ అనే ఓ నెటిజన్ ట్విట్టర్ వేదికగా “ఇండియాలో టెస్లా విడుదల గురించి తదుపరి అప్డేట్లు ఏమైనా ఉన్నాయా..? ప్రపంచంలోని అన్ని ప్రాంతాల్లో లాంచ్ అయ్యే అర్హత టెస్లా కార్లకు ఉంది” అంటూ మస్క్‌ను ట్యాగ్ చేయగా.. దానిపై స్పందించిన ఎలాన్ మస్క్.. ప్రభుత్వంతో ఎదురవుతున్న చాలా సవాళ్లను అధిగమించేందుకు పని చేస్తున్నాం అంటూ రిప్లై ఇచ్చిన విషయం తెలిసిందే..
Hey Elon, I am the Industry & Commerce Minister of Telangana state in India
Will be happy to partner Tesla in working through the challenges to set shop in India/Telangana
Our state is a champion in sustainability initiatives & a top notch business destination in India https://t.co/hVpMZyjEIr
— KTR (@KTRBRS) January 14, 2022
తాజావార్తలు
-
Maharashtra: మహారాష్ట్రలో వాటర్ ఎమర్జెన్సీ.. నీళ్లు వృథా చేస్తే రూ.5 వేల జరిమానా, కేసులు!
-
Rahul Gandhi: పరువు నష్టం కేసు.. సుప్రీంకోర్టులో రాహుల్ గాంధీకి బిగ్ రిలీఫ్..
-
Buddha Prasad: జనసేన లేకుండా.. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి జెండా ఎగురదు!
-
Nani – Rukmini Vasanth: తమిళ దర్శకుడి క్లాసిక్ లవ్ స్టోరీ.. నాని జోడిగా రుక్మిణి వసంత్.?
-
Kishan Reddy: కాంగ్రెస్ ఓటములకు ఎన్నికల సంఘం ఎలా బాధ్యత వహిస్తుంది? కిషన్‌రెడ్డి ప్రశ్న
ట్రెండింగ్
-
Niti Taylor: నువ్వు నాతో పడుకోవాల్సిందే.. సౌత్ డైరెక్టర్ పై నటి సంచలన వ్యాఖ్యలు.!
-
IND vs WI 4th T20: తుది జట్టులో కీలక మార్పులు.. ఆ ఇద్దరికి షాక్.. హైదరాబాద్ టీ20కి భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
Money Plant Care: మీ ఇంట్లో మనీ ప్లాంట్ ఉందా? ఈ 6 సంకేతాలను అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు!
-
Tea Drinking Mistakes: ‘టీ’ తాగడం ఓకే.. కానీ, తాగే సమయలో ఈ తప్పులు చేసారో.. క్యాన్సర్ వచ్చే ప్రమాదం సుమీ..!
-
Jim Jim Taara Song: “జుమ్ జుమ్ తార” అంటే లోకల్ అనుకుంటివా? ఇంటర్నేషనల్.. మెస్సీ ఫుడ్ బాల్ మ్యాచ్‌లో తెలుగు జానపద సాంగ్!!