Harish Rao: రైతులకు ఉచిత విద్యుత్‌కు ఎసరు పెట్టే కుట్ర..? కాంగ్రెస్ ప్రభుత్వంపై హరీష్ రావు ఫైర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Harish Rao: రైతు డిస్కమ్ పేరుతో ఉచిత విద్యుత్‌కు ఎసరు పెట్టే కుట్ర జరుగుతోందని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. రైతు డిస్కమ్ ఏర్పాటు జీవోను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని స్పష్టం చేశారు. ఈ మేరకు మంగళవారం ఓ పత్రికా ప్రకటన విడుదల చేశారు. రైతన్నకు ఉరి వేసే కాంగ్రెస్ కుట్రలను బీఆర్ఎస్ సహించదని, రైతు డిస్కం జీవోను తక్షణం ఉపసంహరించుకోవాలని తెలిపారు. ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ సహా ఇతర రాజకీయ పార్టీలు, ఉద్యోగ సంఘాలు, విద్యుత్ రంగ నిపుణులు, సామాజికవేత్తలు, రైతులు లేవనెత్తుతున్న అభ్యంతరాలను బేఖాతరు చేస్తూ రైతు డిస్కమ్ ఏర్పాటు చేస్తూ జీవో17 జారీ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. రైతు డిస్కమ్ ఏర్పాటు జీవో జారీ కాంగ్రెస్ ప్రభుత్వ నిరంకుశ, దుర్మార్గ వైఖరికి నిదర్శనమన్నారు. ఉచిత విద్యుత్ సరఫరాకు పాతరేసి, రైతు మెడకు ఊరేసేందుకేనా ఈ కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. వ్యవసాయానికి, గృహాలకు, పరిశ్రమలకు నిరంతర విద్యుత్ సరఫరా చేయలేకపోతున్న కాంగ్రెస్ ప్రభుత్వం.. ఇప్పుడు రైతు డిస్కమ్ పేరుతో మరో డ్రామాకు తెరతీయడం సిగ్గుచేటన్నారు. రైతు డిస్కమ్ ఏర్పాటు వల్ల రైతులకు ఒరిగే ప్రయోజనం ఏమిటి? రైతులకు నాణ్యమైన విద్యుత్ అందించేందుకు ఈ నిర్ణయం ఎలా దోహదపడుతుందో చెప్పకుండా మొండిగా వ్యవహరించడం దుర్మార్గమంటూ మండిపడ్డారు.
సర్కార్ నిర్వాకంతో మరింత అన్నదాత ఇబ్బందుల్లో పడ్డారని మాజీ మంత్రి హరీష్ రావు తెలిపారు. “ఇప్పటికే ట్రాన్స్ఫార్మర్స్ కాలిపోతే దిక్కు లేదు..రేపు రైతు డిస్కం తో మరింత ఇబ్బందులు తలెత్తే పరిస్థితి. రైతు మెడకు రైతు డిస్కం ఉచ్చు..ఉచిత విద్యుత్ పై చేతులెత్తేసేందుకే సర్కార్ కొత్త ఎత్తుగడ. పంటలు ఎండి రైతు కన్నీరు పెడుతుంటే.. డిస్కంల పేరిట రేవంత్ సర్కార్ రాజకీయ చదరంగం ఆడుతున్నది. జీవో ప్రకారం కొత్త డిస్కమ్ పరిధిలోకి 30,60,861 వ్యవసాయ కనెక్షన్లు, 512 లిఫ్ట్ ఇరిగేషన్ స్కీంలు, HMWSSB, మిషన్ భగీరథ.. మొత్తంగా 30,62,853 కనెక్షన్లు రైతు డిస్కం కి బదిలీ చేసారు. ఇంత భారీ వ్యవస్థ నిర్వహణ కేవలం 2,000 మంది సిబ్బందితో ఎలా సాధ్యం అవుతుంది? కేవలం 25శాతం థర్మల్ పవర్ అలకేషన్ తో రైతులకు సాగు, ప్రజలకు తాగు నీళ్లకు అవసరం అయ్యే భారీ విద్యుత్ వ్యవస్థ ఎలా నడుస్తుంది? 6,15,651 వ్యవసాయ ట్రాన్స్ఫార్మర్లు, 2.51 లక్షల సర్క్యూట్ కిలోమీటర్ల వ్యవసాయ ఎల్టీ లైన్లు.. వీటి నిర్వహణకు సరిపడా సిబ్బంది లేకపోతే రైతుల కష్టాలకు ఎవరు బాధ్యత వహిస్తారు? రాష్ట్ర విద్యుత్ కేటాయింపుల్లో ఇప్పటికీ 53.28 శాతం థర్మల్ విద్యుత్తే ఉంది. సౌర విద్యుత్తు వాటా 35.31 శాతం మాత్రమే. ఇందులో థర్మల్ 25%, సోలార్ 58%, హైడల్ మొత్తంగా 100% రైతు డిస్కమ్ కు కేటాయించారు. పగటి పూట మాత్రమే సోలార్ విద్యుత్ ఉత్పత్తి అయితే, రాత్రి పూట ఉండదు. రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ అందిస్తామని చెప్పే ప్రభుత్వం.. పగటిపూట మాత్రమే విద్యుత్ ఇచ్చి, రాత్రివేళ రైతులను చీకట్లోకి నెట్టబోతోందా? 2325 MW హైడల్ (జల విద్యుత్) పవర్ మొత్తం రైతు డిస్కమ్కే కేటాయించారు. కానీ ఈ హైడల్ పవర్ సాంకేతికంగా ఏడాదిలో కేవలం 3-4 నెలలు మాత్రమే అందుబాటులో ఉంటుంది. అంటే మిగతా 8 నెలలు రైతు డిస్కమ్‌కి ఈ విద్యుత్ అందుబాటులో ఉండదు. అప్పుడు ఎలా నిర్వహిస్తారు? కొత్త డిస్కమ్‌కు భారీ రుణాలు, బకాయిలను కేటాయిస్తూ.. దాని ఆర్థిక స్థిరత్వంపై ప్రభుత్వం ఏం భరోసా ఇస్తోంది? ఈ అప్పుల భారం చివరకు రైతులపై పడేయాలని చూస్తున్నారా?” అని మాజీ మంత్రి ప్రశ్నించారు.
Also Read
- Amit Shah Hyderabad Visit: కేంద్ర హోం మంత్రి అమిత్ షా పర్యటన.. ‘ఇండియా’ కూటమికి కౌంటర్‌గా పాదయాత్ర.?
- Raptadu School Attack: టెన్త్ క్లాస్ విద్యార్థినిపై రంపంతో దాడి.. నిందితుడి కాళ్లు కట్!
- మళ్లీ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి Karbonn.. Rebel సిరీస్‌లో రానున్న ఫోన్లు..!
- Hyderabad: లక్ష్మీగూడలో విషాదం.. ఎనిమిదేళ్ల బాలుడు ఆత్మహత్య.!
రైతు డిస్కమ్ పేరుతో వ్యవసాయ విద్యుత్ బాధ్యతలను వేరుచేసి, రేపు నష్టాల సాకుతో రైతులపై ఆంక్షలు విధించే ప్రమాదం లేదా? రైతులకు ఉచిత విద్యుత్ కొనసాగుతుందని, 24 గంటల సరఫరాలో ఎలాంటి కోతలు ఉండవని ప్రభుత్వం లిఖితపూర్వక హామీ ఇవ్వగలదా? అని హరీష్ రావు నిలదీశారు. “రైతుల అనుమానాలను నివృత్తి చేయకుండా ఏకపక్షంగా ముందుకు వెళ్లడం కుదరదు. కొత్త సంస్థ ఏర్పాటుతో అదనపు పరిపాలనా ఖర్చులు ఎంత? ఆ ఖర్చులను ఎవరు భరిస్తారు? ఆస్తులు, అప్పులు, ఉద్యోగుల బదిలీపై పూర్తి వివరాలను ప్రభుత్వం బహిర్గతం ఎందుకు చేయలేదు? రైతుల పేరుతో డిస్కమ్ ఏర్పాటు చేయడం గొప్ప కాదు.. రైతులకు నాణ్యమైన విద్యుత్ అందించడం ముఖ్యం. సంస్థల పేర్లు మార్చడం, కొత్త సంస్థలు ఏర్పాటు చేయడం కాదు.. రైతుల విద్యుత్ సమస్యలకు పరిష్కారం చూపాలి. రైతుల ప్రయోజనాలే లక్ష్యమైతే వారి అభ్యంతరాలను పక్కనపెట్టి ఎందుకు ముందుకెళ్తున్నారు? ఉద్యోగ సంఘాలు, విద్యుత్ రంగ నిపుణులు లేవనెత్తిన సందేహాలకు సమాధానం చెప్పకుండా చాటు మాటుగా జీవో జారీ చేయడం వెనుక ఉద్దేశం ఏమిటి? రైతులకు భరోసా ఇవ్వాల్సిన కాంగ్రెస్ ప్రభుత్వం.. రైతుల్లో అనుమానాలు, ఆందోళనలు ఎందుకు పెంచుతోంది. రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ సరఫరాపై స్పష్టమైన హామీ ఇవ్వాలి. రైతు డిస్కమ్ వల్ల కలిగే ప్రయోజనాలు, ఆర్థిక భారం, సిబ్బంది నిర్వహణపై పూర్తి వివరాలు వెల్లడించాలి. రైతుల అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోకుండా ఏకపక్షంగా ముందుకు వెళ్లకూడదు. రైతు డిస్కమ్ ఏర్పాటు వెనుక రైతుల ప్రయోజనాలే లక్ష్యమైతే మా ప్రశ్నలకు సమాధానం చెప్పాలి.. లేదంటే తక్షణం జీవో ఉపసంహరించుకోవాలి అని యావత్ రైతాంగం పక్షాన BRS పార్టీ తరుపున డిమాండ్ చేస్తున్నాం.” అని స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
New Airfare Rules 2026: విమాన ఛార్జీలపై కీలక నిర్ణయం.. టికెట్ ధరలను నియంత్రించే అధికారం కేంద్రానికి!
-
Amit Shah Hyderabad Visit: కేంద్ర హోం మంత్రి అమిత్ షా పర్యటన.. ‘ఇండియా’ కూటమికి కౌంటర్‌గా పాదయాత్ర.?
-
Punjab AAP Crisis: పంజాబ్‌లో ఆప్‌కు మరో భారీ షాక్.. రెండు రోజుల్లో ముగ్గురు ఎమ్మెల్యేల రాజీనామా!
-
Raptadu School Attack: టెన్త్ క్లాస్ విద్యార్థినిపై రంపంతో దాడి.. నిందితుడి కాళ్లు కట్!
-
మళ్లీ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి Karbonn.. Rebel సిరీస్‌లో రానున్న ఫోన్లు..!
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 50MP కెమెరా, 144Hz డిస్ప్లేతో OnePlus Turbo 6Vs స్మార్ట్‌ఫోన్ లాంచ్..!
-
UPI Transactions: డిజిటల్ చెల్లింపుల్లో భారత్ సరికొత్త రికార్డు.. రోజుకు రూ. లక్ష కోట్ల లావాదేవీలతో యూపీఐ సరికొత్త మైలురాయి..!
-
Shreyas Iyer: మేము చెత్తగా ఆడాం, చాలా తప్పులు చేశాం.. న్యూజిలాండ్ ఓటమిపై శ్రేయస్ కీలక వ్యాఖ్యలు!
-
IND vs NZ: వన్డే సిరీస్‌కు ముందు బిగ్ షాక్.. ఆ స్టార్ ప్లేయర్స్ సిరీస్ నుండి అవుట్.!
-
SOS బటన్, Family Assist ఫీచర్లtho ‘సీనియర్ సిటిజన్ల’ కోసం Nokia 2360 Flip ఫోన్ లాంచ్..!