Nani – Rukmini Vasanth: తమిళ దర్శకుడి క్లాసిక్ లవ్ స్టోరీ.. నాని జోడిగా రుక్మిణి వసంత్.?
- నేచురల్ స్టార్ నాని, తమిళ దర్శకుడు సి. ప్రేమ్ కుమార్ కాంబినేషన్
- సినిమా రానున్నట్లు సినీ వర్గాల్లో ప్రచారం..
- నాని సరసన హీరోయిన్గా రుక్మిణి వసంత్‌ను ఎంపిక..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nani – Rukmini Vasanth: విభిన్నమైన కథాంశాలతో టాలీవుడ్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్న నేచురల్ స్టార్ నాని, త్వరలోనే హృదయాన్ని హత్తుకునే ప్రేమకథతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రంగం సిద్ధమవుతున్నట్లు టాలీవుడ్ సర్కిల్ లో బాగా టాక్ వినపడుతుంది. ‘96’, ‘సత్యం సుందరం’ చిత్రాలతో భావోద్వేగాలను వెండితెరపై దృశ్యకావ్యాలుగా మలిచిన తమిళ దర్శకుడు సి. ప్రేమ్ కుమార్ దర్శకత్వంలో నాని ఓ చిత్రం చేయనున్నారనే వార్త ప్రస్తుతం సినీ వర్గాల్లో తెగ చక్కర్లు కొడుతుంది.
దర్శకుడు ప్రేమ్ కుమార్ రాసిన ఈ కథ భావోద్వేగాల మేళవింపుతో కూడిన పూర్తి స్థాయి లవ్ స్టోరీగా ఉండనుందని సమాచారం. ముఖ్యంగా ఇందులో కథానాయిక పాత్ర చాలా బలంగా, కథను మలుపు తిప్పే విధంగా డిజైన్ చేశారట. నటనకు ఎంతో ఆస్కారమున్న ఈ పాత్ర కోసం పలువురి పేర్లను పరిశీలించిన తర్వాత.. పలు చిత్రాలలో తన నటనతో తెలుగు ప్రేక్షకులను మెప్పించిన రుక్మిణి వసంత్‌ను చిత్రబృందం ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. నాని సరసన ఆమె జోడీ కడితే, వెండితెరపై సరికొత్త అనుభూతిని పంచే క్లాసిక్ పెయిర్ కానుంది.
Also Read
- Niti Taylor: నువ్వు నాతో పడుకోవాల్సిందే.. సౌత్ డైరెక్టర్ పై నటి సంచలన వ్యాఖ్యలు.!
- Prithvi Weds Akriti: నిశ్చితార్థం రద్దు తర్వాత.. మళ్లీ ఒకటైన పృథ్వీ షా - ఆకృతి.. కారణం చెప్పిన నటి..
- Selma Blair Flight Incident: విమానంలో వీరంగం.. ఇద్దరు ఫ్లైట్ అటెండెంట్లను కొరికిన స్టార్ నటి!
- Vijay Deverakonda: సీఎం విజయ్‌తో విజయ్ దేవరకొండ, రష్మిక భేటీ.. రౌడీ హీరో పోస్ట్ వైరల్!
గతంలో ‘96’ చిత్రంతో వ్యక్తీకరించలేని ప్రేమను, మధురమైన జ్ఞాపకాలను అత్యద్భుతంగా ఆవిష్కరించిన ప్రేమ్ కుమార్.. ‘సత్యం సుందరం’తో మనుషుల మధ్య నిస్వార్థమైన బంధాలను అంతే గొప్పగా చూపించారు. అలాంటి దర్శకుడు ఇప్పుడు నాని వంటి సహజ నటుడితో చేతులు కలపడం సినిమాపై అంచనాలను పెంచేస్తోంది. కమర్షియల్ హంగులు, భారీ యాక్షన్ ఎపిసోడ్ల కంటే.. పాత్రల స్వభావాలు, హృదయాన్ని తాకే భావోద్వేగాలకే ఈ చిత్రంలో పెద్దపీట వేయనున్నట్లు టాక్. ప్రస్తుతం దర్శకుడు సుజిత్ ప్రాజెక్ట్ “బ్లడీ రోమియో”తో బిజీగా ఉన్న నాని.. ఆ తర్వాత ఈ ఎమోషనల్ ప్రేమకథను పట్టాలెక్కించే అవకాశముంది. ఈ క్రేజీ కాంబినేషన్, హీరోయిన్ ఎంపికపై అధికారిక ప్రకటన వస్తే తప్ప పూర్తి స్పష్టత రాదు.
తాజావార్తలు
-
Nani – Rukmini Vasanth: తమిళ దర్శకుడి క్లాసిక్ లవ్ స్టోరీ.. నాని జోడిగా రుక్మిణి వసంత్.?
-
Kishan Reddy: కాంగ్రెస్ ఓటములకు ఎన్నికల సంఘం ఎలా బాధ్యత వహిస్తుంది? కిషన్‌రెడ్డి ప్రశ్న
-
PM Modi: 21వ శతాబ్దంలో టెక్నాలజీనే శక్తి.. 2014 నుంచి చౌకగా మొబైల్ డేటా లభిస్తుందన్న మోడీ
-
Niti Taylor: నువ్వు నాతో పడుకోవాల్సిందే.. సౌత్ డైరెక్టర్ పై నటి సంచలన వ్యాఖ్యలు.!
-
IND vs WI 4th T20: తుది జట్టులో కీలక మార్పులు.. ఆ ఇద్దరికి షాక్.. హైదరాబాద్ టీ20కి భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
ట్రెండింగ్
-
Money Plant Care: మీ ఇంట్లో మనీ ప్లాంట్ ఉందా? ఈ 6 సంకేతాలను అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు!
-
Tea Drinking Mistakes: ‘టీ’ తాగడం ఓకే.. కానీ, తాగే సమయలో ఈ తప్పులు చేసారో.. క్యాన్సర్ వచ్చే ప్రమాదం సుమీ..!
-
Jim Jim Taara Song: “జుమ్ జుమ్ తార” అంటే లోకల్ అనుకుంటివా? ఇంటర్నేషనల్.. మెస్సీ ఫుడ్ బాల్ మ్యాచ్‌లో తెలుగు జానపద సాంగ్!!
-
Electrical Switch Boards Cleaning: జిడ్డుగా మారిన స్విచ్ బోర్డులు ఇలా క్లీన్ చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!
-
How To Grow Black Pepper Plant In Pots: మార్కెట్లో మిరియాలు కొనాల్సిన పనిలేదు.. బాల్కనీలోనే ఇలా పెంచండిలా..