సీఎం జగన్‌, చిరు భేటీపై స్పందించిన నాగ్.. తప్పకుండా గుడ్‌న్యూస్‌..!

సినిమా టికెట్ల ధరల వివాదం ఆంధ్రప్రదేశ్‌లో కాక రేపింది.. ఓవైపు సినిమా పరిశ్రమకు చెందినవారి కామెంట్లు.. మరోవైపు.. అధికార వైసీపీకి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, నేతలు చేసిన వ్యాఖ్యలు.. క్రమంగా ఏపీ సర్కార్‌, సినీ పరిశ్రమకు మధ్య గ్యాప్‌ పెంచుతున్నాయనే విమర్శలు వినిపించాయి.. ఇప్పట్లో ఈ సమస్య పరిష్కారం కాదేమో అనే అనుమానాలు కూడా కలిగాయి.. అయితే, సినీ పెద్దలు వివాదానికి తెరదింపే ప్రయత్నాలు చేశారు.. ఇదే సమయంలో.. ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌.. మెగాస్టార్‌ చిరంజీవిని ఆహ్వానించడం.. ఆయన క్యాంప్ కార్యాలయానికి వెళ్లి సీఎంతో చర్చలు జరిపి.. ఆనందాన్ని వ్యక్తం చేయడం జరిగిపోయాయి.. ఆ తర్వాత అనేక రకాలుగా ప్రచారాలు తెరపైకి వచ్చాయి.. ఇక, సీఎం వైఎస్‌ జగన్‌, మెగాస్టార్‌ చిరంజీవి భేటీపై స్పందించారు అక్కినేని నాగార్జున.

Read Also: సందడే సందడి.. గుర్రం డ్యాన్స్‌.. బాలయ్య స్వారీ..

నాగార్జున నటించిన బంగార్రాజు మూవీ సంక్రాంతి కానుకగా విడుదలై.. హిట్‌ టాక్‌ తెచ్చుకున్న సందర్భంగా హైదరాబాద్‌లో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసింది చిత్ర యూనిట్‌.. ఈ సందర్భంగా.. సీఎం-చిరంజీవి భేటీపై మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా.. చిరంజీవి గారు వెళ్లారంటే తప్పకుండా సినీ ఇండస్ట్రీకి హ్యాపీ ఎండింగ్ వస్తుందని వ్యాఖ్యానించారు.. కాగా, చిరంజీవి, సీఎం జగన్‌ను కలవడానికి వెళ్తున్న సందర్భంగా స్పందించిన నాగార్జున.. మా అందరి కోసమే చిరంజీవి.. వైఎస్‌ జగన్‌తో భేటి అవుతున్నారని… సినీ ఇండస్ట్రీ సమస్యలను సీఎం జగన్ దృష్టికి చిరంజీవి తీసుకుని వెళ్తారని.. బంగార్రాజు సినిమా విడుదల ఉండటం వల్లే చిరంజీవితో కలిసి తాను సీఎం వైఎస్‌ జగన్ దగ్గరకు వెళ్లలేకపోయినట్లు నాగార్జున వెల్లడించిన విషయం తెలిసిందే.

Related Articles

Latest Articles