ఆటలు సాగవు.. జగన్ ఎన్ని కుయుక్తులు పన్నినా ఫలితం ఉండదు..!
ఏపీ సీఎం వైఎస్ జగన్.. కేంద్రానికి లేఖలు రాయడం దొంగే దొంగా.. దొంగా అన్నట్లుగా ఉందంటూ ఫైర్ అయ్యారు తెలంగాణ మంత్రి జగదీష్ రెడ్డి… పోతిరెడ్డిపాడు నుంచి అక్రమంగా నీటిని తొడుకు పోతున్నారని ఆరోపించిన ఆయన.. వైఎస్ జగన్ ప్రభుత్వం 203 జీవోను వెనక్కి తీసుకొని, రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని వెంటనే ఆపాలని డిమాండ్ చేశారు.. వరద జలాల పేరుతో శ్రీశైలం ప్రాజెక్టు నీళ్లను ఇన్నాళ్లు అక్రమంగా తీసుకుపోయారు… ఇక, వారి ఆటలు సాగవన్న ఆయన.. సీఎం జగన్ ఎన్ని రోజులు లేఖలు రాసినా, ఎన్ని కుయుక్తులు పన్నినా ఫలితం ఉండదన్నారు.. తెలంగాణ రైతుల ప్రయోజనాలకు భంగం వాటిల్లితే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. ఇక, తెలంగాణలోని ప్రతిపక్ష పార్టీలకు భవిష్యత్ లేదన్నారు జగదీష్ రెడ్డి.. అధికారంలోకి వస్తామని పగటి కలలు కనే పగటి వేషగాళ్లు ఎక్కువగా ఉన్నారన్న ఆయన.. టీఆర్ఎస్ పార్టీని ఏదో చేస్తామనే వారి తరం కాదన్నారు.. కేసీఆర్ బతికున్నంత కాలం ప్రజలు కేసీఆర్ పాలనను వదులుకోరు.. పాలనలో కేసీఆర్ను మించిన వారు కనుచూపు మేరలో లేరని.. ప్రతిపక్షాలు ఏనాడు ప్రజల గురించి పట్టించుకోలేదు, ఆంధ్రకు లాభం చేసేలా వ్యవహరించాయని ఆరోపించారు.
Also Read
- Telangana Legislative Council: ఎమ్మెల్సీలుగా ప్రమాణస్వీకారం చేసిన అజారుద్దీన్, ప్రో. కోదండరాం
- Petrol, Diesel: రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ కొరత భయాల వేళ.. సివిల్ సప్లై కమిషనర్ కీలక ప్రకటన
- Traffic Constable: రైతు ఇబ్బంది తీర్చిన ట్రాఫిక్ కానిస్టేబుల్.. స్థానికుల నుంచి ప్రశంసల వర్షం
- BRS 26th Foundation Day: 25 ఏళ్ల ప్రయాణం.. 26వ వసంతంలోకి బీఆర్ఎస్
తాజావార్తలు
-
Mamata Banerjee: మోడీ ‘ఝల్మురి’.. మమత ‘ఫ్రూట్స్’ కొనుగోలు.. ఫొటోలు వైరల్
-
Raja Shivaji: రితేష్-జెనీలియా డ్రీమ్ ప్రాజెక్ట్ ‘రాజా శివాజీ’ అడ్వాన్స్ బుకింగ్స్ షురూ!
-
Infosysకు 20 ఎకరాల స్థలం కేటాయింపు.. ఏపీ సర్కార్ ఉత్తర్వులు
-
Telangana Legislative Council: ఎమ్మెల్సీలుగా ప్రమాణస్వీకారం చేసిన అజారుద్దీన్, ప్రో. కోదండరాం
-
Faria Abdullah: అతని కోసమే నేను ఇండస్ట్రీలోకి వచ్చాను..
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!