Errabelli Dayakar Rao: కాంగ్రెస్, బీజేపీ మాకు పోటీ కాదు.. రారు..!
కాంగ్రెస్ పార్టీ, భారతీయ జనతా పార్టీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు.. తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీ మాకు ఎక్కడా పోటీ కాదు.. రారు.. అంటూ మీడియా చిట్‌చాట్‌లో పేర్కొన్నారు. ఇక, పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డిపై సెటైర్లు వేశారు ఎర్రబెల్లి… రేవంత్ రెడ్డి ఎప్పుడు కూడా ఆయన సొంత ఇమేజ్ కోసమే ప్రయత్నం చేస్తారని ఎద్దేవా చేశారు.. రేవంత్ రెడ్డి ఉన్నన్ని రోజులు కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి రాదు అని జోస్యం చెప్పారు. రాష్ట్రంలో ఉన్న ప్రతిపక్ష పార్టీలు వాళ్లను వాళ్లు కాపాడుకోవడం కోసమే పని చేస్తున్నారని సెటైర్లు వేశారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. మరోవైపు, మహారాష్ట్ర రాజకీయ సంక్షోభంపై స్పందించిన మంత్రి ఎర్రబెల్లి… బీజేపీ నేతలు మూర్ఖులు అంటూ మండిపడ్డారు.. వాళ్లు (భారతీయ జనతా పార్టీ) ప్రాంతీయ పార్టీలను చీల్చే ప్రయత్నం చేస్తున్నారని విమర్శలు గుప్పించారు.. మహారాష్ట్రలో కూడా అదే చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా, మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం రసవత్తరంగా మారిన విషయం తెలిసిందే.. శివసేన ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేయడంతో.. ఉద్దవ్ థాక్రే ప్రభుత్వం కొనసాగడం ప్రశ్నార్థకంగా మారింది. తాను రాజీనామాకు సిద్ధం అని కూడా ప్రకటించారు సీఎం ఉద్దవ్ థాక్రే.
Also Read
- Kadiyam Srihari: కేసీఆర్‌పై కడియం శ్రీహరి సంచలన వ్యాఖ్యలు.. వరంగల్ జిల్లాను 6 ముక్కలు చేసి ఆగమాగం చేశారంటూ..
- Ticket Inspector: టికెట్ ఇన్ స్పెక్టర్ పై కండక్టర్ చెప్పుతో దాడి చేసిన ఘటనలో ట్విస్ట్..
- DGP C.V. Anand: కొత్త డీజీపీగా సీవీ ఆనంద్ తొలి ప్రెస్‌మీట్.. పోలీస్ శాఖలో 19 వేల ఖాళీలు.. రిక్రూట్మెంట్పై కీలక ప్రకటన
- TGSRTC: రూ. 20 వేలు లంచం డిమాండ్ చేసిన టికెట్ ఇన్ స్పెక్టర్.. చెప్పుతో దాడి చేసిన కండక్టర్, ప్రయాణికులు
తాజావార్తలు
-
CM Chandrababu: స్టేజ్‌పైనే అధికారులకు సీఎం చంద్రబాబు క్లాస్.. పనితీరుపై సీరియస్ వార్నింగ్..
-
IPL Rules: బౌలర్లకు న్యాయం కావాలి.. ఐపీఎల్ నిబంధనల్లో మార్పులు తప్పనిసరి!
-
Ambati Rambabu: అమరావతి నా జన్మలోనే కాదు.. చంద్రబాబు, లోకేష్ జన్మలో కూడా పూర్తి కాదు..!
-
Beetroot Rice Recipe: ఆరోగ్యానికి ఆరోగ్యం.. రుచికి రుచి! హెల్తీ బీట్రూట్ పులావ్ తయారు చేయండిలా..
-
Kadiyam Srihari: కేసీఆర్‌పై కడియం శ్రీహరి సంచలన వ్యాఖ్యలు.. వరంగల్ జిల్లాను 6 ముక్కలు చేసి ఆగమాగం చేశారంటూ..
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్‌తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!