CM KCR: 9 జిల్లాల్లో వైద్య కళాశాలలు.. వర్చువల్‌గా ప్రారంభించనున్న సీఎం కేసీఆర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM KCR: దేశ వైద్య రంగంలో తెలంగాణలో నేడు సరికొత్త రికార్డు నమోదు కానుంది. తొమ్మిది ప్రభుత్వ వైద్య కళాశాలల్లో తరగతులు ప్రారంభం కానున్నాయి. కామారెడ్డి, కరీంనగర్, ఖమ్మం, జయశంకర్ భూపాలపల్లి, కుమ్రంభీం ఆసిఫాబాద్, నిర్మల్, రాజన్న సిరిసిల్ల, వికారాబాద్, జనగాం జిల్లాల్లో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన మెడికల్ కాలేజీల్లో ఈరోజు 12 గంటలకు వర్చువల్ తరగతులను సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు. ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని పండుగ వాతావరణంలో నిర్వహించనుంది. మెడికల్ కాలేజీ ఏర్పాటు వల్ల కలిగే ప్రయోజనాలను ప్రజలకు వివరించాలని ఇటీవల మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు ఆయా జిల్లాల ప్రజా ప్రతినిధులను ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు ఆయా జిల్లా కేంద్రాల్లో జరిగే కార్యక్రమాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొననున్నారు. జిల్లా కేంద్రాల్లో కనీసం 15-20 వేల మందితో భారీ ర్యాలీలు నిర్వహించనున్నారు. ఇందులో యువత, విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొంటారన్నారు. వైద్య కళాశాల ఏర్పాటుతో విద్యార్థులకే కాకుండా దానికి తోడు అందుబాటులోకి రానున్న దవాఖాన ద్వారా ప్రజలకు అత్యుత్తమ వైద్యసేవలు అందుతాయి. కామారెడ్డిలో జరిగే కార్యక్రమంలో వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు స్వయంగా పాల్గొంటారని సమాచారం.
Read also: MLC Kavitha: సుప్రీంకోర్టులో కేసు తేలాకే ఏదైనా.. ఈడీ విచారణకు వెళ్లకూడదని కవిత నిర్ణయం!
Also Read
- Komatireddy Venkat Reddy: తెలంగాణకు కేంద్రం గుడ్‌న్యూస్.. ఎల్బీనగర్–హయత్‌నగర్ డబుల్ డెక్కర్ కారిడార్‌కు ఆమోదం!
- Election Commission: గ్రాడ్యుయేట్ ఓటరు నమోదుకు EPIC నంబర్ అవసరమా? ఎన్నికల కమిషన్ క్లారిటీ
- Kishan Reddy: కాంగ్రెస్ ఓటములకు ఎన్నికల సంఘం ఎలా బాధ్యత వహిస్తుంది? కిషన్‌రెడ్డి ప్రశ్న
- Hyderabad: జైల్లో భర్త.. తనను పెళ్లి చేసుకోవాలని వేధిస్తూ భార్యను హత్య చేసి భర్త ఫ్రెండ్..!
ఇదిలా ఉండగా కేవలం కార్పొరేట్ దవాఖానల్లో మాత్రమే అందుబాటులో ఉండే ప్రపంచ స్థాయి రోబోటిక్ వైద్య సేవలను రాష్ట్ర ప్రభుత్వం నిమ్స్, ఎంఎన్‌జే డిస్పెన్సరీలకు విస్తరించింది. తద్వారా పేద ప్రజలకు నాణ్యమైన, అధునాతన వైద్య సేవలు ఉచితంగా అందుతున్నాయి. నిమ్స్ అభివృద్ధికి సీఎం కేసీఆర్ ఇటీవల రూ.156 కోట్లు మంజూరు చేయడం గొప్ప విషయమన్నారు. తెలంగాణ ప్రాంతంలో గుండెకాయ లాంటి హైదరాబాద్ వాసుల వైద్య అవసరాలను తీర్చేందుకు జీహెచ్ ఎంసీ పరిధిలోని 6 జోన్లకు 6 డీఎంహెచ్ ఓ పోస్టులను ప్రభుత్వం మంజూరు చేసింది. గాంధీలో సంతానోత్పత్తి కేంద్రం, అవయవ మార్పిడి కేంద్రం ఏర్పాటు చేయనున్నారు. గాంధీ, నిమ్స్, అల్వాల్‌లో సూపర్‌స్పెషాలిటీ ఎంసీహెచ్‌లు నిర్మాణంలో ఉన్నాయి. జీహెచ్‌ఎంసీలో 350 బస్తీ దవాఖానలను ఏర్పాటు చేశారు. అన్ని రంగాల్లో అగ్రగామిగా ఉన్న హైదరాబాద్ ను అధునాతన వైద్య సేవలకు కేరాఫ్ అడ్రస్ గా మార్చి మెడికల్ హబ్ గా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టడం విశేషం.
2015లో సీఎం కేసీఆర్ ఉస్మానియా ఆస్పత్రిని సందర్శించి నూతన భవనాన్ని నిర్మిస్తామని ప్రకటించారు. రాని వారు కొందరు కోర్టుకు వెళ్లడంతో జాప్యం జరుగుతోంది. చారిత్రాత్మకమైన ఉస్మానియా ఆసుపత్రి నూతన భవన నిర్మాణానికి ప్రభుత్వం శరవేగంగా చర్యలు తీసుకుంటోంది. హైకోర్టు ఆదేశాల మేరకు ఆ ప్రాంత ప్రజాప్రతినిధులతో డిస్పెన్సరీ సమావేశం నిర్వహించి ఇప్పటికే అఫిడవిట్ రూపంలో కోర్టును ఆశ్రయించింది. హైకోర్టు తీర్పు వెలువడిన వెంటనే 2000 పడకల నూతన ఉస్మానియా భవనాన్ని నిర్మిస్తామని ప్రభుత్వం ప్రకటించడం స్వాగతించదగ్గ పరిణామం. జిల్లా వైద్య కళాశాల. తద్వారా దేశ వైద్య చరిత్రలో తెలంగాణ అద్వితీయ రికార్డు సృష్టించింది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ప్రభుత్వ వైద్య కళాశాలలను ఏర్పాటు చేసిన ఏకైక రాష్ట్రంగా అవతరించింది. ఇప్పటికే 25 జిల్లాల్లో మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేసిన రాష్ట్ర ప్రభుత్వం జోగులాంబ గద్వాల, నారాయణపేట, ములుగు, వరంగల్, మెదక్, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాల్లో మెడికల్ కాలేజీలను ప్రారంభించబోతోంది. ఒక్కో కాలేజీలో 100 ఎంబీబీఎస్ సీట్లతో తరగతులు ప్రారంభించేందుకు అవసరమైన చర్యలు తీసుకోనున్నారు. దీంతో రాష్ట్రంలో మొత్తం ఎంబీబీఎస్ సీట్ల సంఖ్య పదివేలకు చేరువకానుంది.
MLC Kavitha: సుప్రీంకోర్టులో కేసు తేలాకే ఏదైనా.. ఈడీ విచారణకు వెళ్లకూడదని కవిత నిర్ణయం!
తాజావార్తలు
-
UPI Charges: యూపీఐ చెల్లింపులపై కేంద్రం క్లారిటీ.. ఎప్పటి నుంచి అమల్లోకి అంటే..!
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Komatireddy Venkat Reddy: తెలంగాణకు కేంద్రం గుడ్‌న్యూస్.. ఎల్బీనగర్–హయత్‌నగర్ డబుల్ డెక్కర్ కారిడార్‌కు ఆమోదం!
-
Anaparthi Kidnapping Case: ఐదేళ్ల బాలుడి కిడ్నాప్ కథ సుఖాంతం.. 15 రోజుల తర్వాత తల్లిదండ్రుల ఒడికి చిన్నారి!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
ట్రెండింగ్
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!
-
Sarah Dambanevana: క్రికెట్లో విషాదం.. మాజీ క్రికెటర్, అంతర్జాతీయ అంపైర్ సారా కన్నుమూత.!
-
Niti Taylor: నువ్వు నాతో పడుకోవాల్సిందే.. సౌత్ డైరెక్టర్ పై నటి సంచలన వ్యాఖ్యలు.!
-
IND vs WI 4th T20: తుది జట్టులో కీలక మార్పులు.. ఆ ఇద్దరికి షాక్.. హైదరాబాద్ టీ20కి భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
Money Plant Care: మీ ఇంట్లో మనీ ప్లాంట్ ఉందా? ఈ 6 సంకేతాలను అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు!