Bhatti Vikramarka : తెలంగాణలో పెట్టుబడులకు అండగా ఉంటాం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణను పెట్టుబడులకు అత్యంత సురక్షితమైన , అనుకూలమైన గమ్యస్థానంగా మలచడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. హైదరాబాద్ వేదికగా జరుగుతున్న ‘సమాఖ్య గ్లోబల్ బిజినెస్ మీట్–2026’ సదస్సులో ఆయన పాల్గొని పారిశ్రామికవేత్తలను ఉద్దేశించి ప్రసంగించారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పారిశ్రామిక దిగ్గజాలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని, రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. పెట్టుబడిదారులు ముందుకు వస్తే ప్రభుత్వపరంగా అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తామని భరోసా కల్పించారు.
పెట్టుబడులకు అద్భుతమైన అనుకూలతలు
రాష్ట్రంలో పరిశ్రమల స్థాపనకు అవసరమైన అన్ని వసతులను ప్రభుత్వం కల్పిస్తోందని భట్టి విక్రమార్క తెలిపారు. సింగిల్ విండో విధానం ద్వారా ఎలాంటి జాప్యం లేకుండా అనుమతులు ఇస్తున్నామని, పారిశ్రామికవేత్తలకు అవసరమైన భూమి, నిరంతరం విద్యుత్, , నీటి సదుపాయాలను సులభంగా అందిస్తున్నామని పేర్కొన్నారు. రాష్ట్రంలో అందుబాటులో ఉన్న నైపుణ్యవంతమైన మానవ వనరులు, మెరుగైన మౌలిక వసతులు పారిశ్రామిక రంగానికి ఎంతగానో ఉపయోగపడతాయని ఆయన అభిప్రాయపడ్డారు.
Also Read
- Telangana Studies: వియత్నాం విద్యా మోడల్‌పై తెలంగాణ ఫోకస్.. మనబడిలో ఏం మారబోతోంది?
- TG SAFE: హైదరాబాద్‌లో అక్రమ డైరీ దందా గుట్టురట్టు.. వెలుగులోకి షాకింగ్ విషయాలు..
- Rain Alert: తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన.. ఏపీలో పిడుగులతో వానలు, తెలంగాణలో భారీ వర్షాలు!
- CM Revanth Reddy: విద్యుత్ అంతరాయాలపై సీఎం రేవంత్ ఆగ్రహం.. నిర్లక్ష్యం వహిస్తే సస్పెన్షన్ తప్పదు!
ప్రత్యేక క్లస్టర్లు, గ్రామీణ ప్రాంతాలకు ప్రోత్సాహం
ఫార్మా, బయోటెక్నాలజీ, ఐటీ, , ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) రంగాల అభివృద్ధి కోసం ప్రత్యేక క్లస్టర్లను ఏర్పాటు చేస్తున్నట్లు డిప్యూటీ సీఎం వెల్లడించారు. ఔటర్ రింగ్ రోడ్ (ORR) , రీజినల్ రింగ్ రోడ్ (RRR) మధ్య పారిశ్రామిక క్లస్టర్లను అభివృద్ధి చేస్తున్నామని, ఇందులో భాగంగా ఇప్పటికే 21 రేడియల్ రోడ్ల మంజూరు , రూపకల్పన ప్రక్రియ వేగంగా కొనసాగుతోందని వివరించారు. కేవలం నగరాలకే పరిమితం కాకుండా, గ్రామీణ ప్రాంతాల్లోనూ వ్యవసాయ ఆధారిత పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వం తగిన ప్రోత్సాహకాలు అందిస్తోందన్నారు.
సమ్మిళిత అభివృద్ధికి పెద్దపీఠం
రాష్ట్ర ఆర్థికాభివృద్ధిలో పరిశ్రమలు, సేవారంగాలదే కీలక పాత్ర అని భట్టి విక్రమార్క ఉద్ఘాటించారు. సంపద సృష్టికర్తల వల్లే రాష్ట్ర ఆర్థిక ప్రగతి సాధ్యమవుతుందని, ఈ క్రమంలో సమాఖ్య చాంబర్ ఆఫ్ కామర్స్ చేస్తున్న కృషిని ఆయన ప్రత్యేకంగా అభినందించారు. ప్రపంచ వ్యాపారవేత్తలను హైదరాబాద్‌కు తీసుకురావడం రాష్ట్ర పురోగతికి గొప్ప అవకాశమన్నారు. కేవలం లాభాలార్జనే కాకుండా, అభివృద్ధి ఫలాలు అన్ని వర్గాలకూ అందాలని, ఇతర వర్గాలకూ వ్యాపార అనుభవం, పరిజ్ఞానం పంచుతూ సమ్మిళిత అభివృద్ధికి పారిశ్రామికవేత్తలు సహకరించాలని కోరారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయత్వంలో పారిశ్రామిక అనుకూల విధానాలను అమలు చేస్తూ, తెలంగాణను దేశంలోనే నంబర్‌వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం నిరంతరం శ్రమిస్తోందని ఆయన స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
Bhatti Vikramarka : తెలంగాణలో పెట్టుబడులకు అండగా ఉంటాం..
-
BYD Atto 8 EV: కేవలం 9 నిమిషాల్లో 97% ఛార్జింగ్! BYD కొత్త ఎలక్ట్రిక్ SUV.. 651 కి.మీ. రేంజ్‌తో వస్తోంది!
-
Telangana Studies: వియత్నాం విద్యా మోడల్‌పై తెలంగాణ ఫోకస్.. మనబడిలో ఏం మారబోతోంది?
-
Prabhas: డార్లింగ్ ఫ్యాన్స్‌కి బ్యాడ్ న్యూస్.. ఇప్పట్లో థియేటర్లలోకి రాని రెబల్ స్టార్!
-
Mrunal Thakur: అవకాశాలు లేవా? కథలు నచ్చట్లేదా? మృణాల్ ఎందుకు సైలెంట్ అయింది!
ట్రెండింగ్
-
Small Kitchen Ideas: వంటగది కౌంటర్ ఎప్పుడూ తడిగా, చిందరవందరగా ఉంటుందా? ఈ చిన్న ప్లానింగ్ చేసుకోండి!
-
How To Grow Moringa: పోషకాల నిధి మునగ.. కుండీలో మురింగ చెట్టును ఈజీగా పెంచే టిప్స్ మీ కోసం..
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్‌లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!
-
Keemo Paul: మేము ఏ జట్టునైనా ఓడిస్తాం.. టీమిండియా జుజుబి.. విండీస్ పేసర్ సంచలన వ్యాఖ్యలు!
-
Cibil Score: మీ సిబిల్ స్కోర్ తక్కువగా ఉందా.. 6 నెల్లలో ఇలా సింపుల్‌గా పెంచుకోండి..