CM Revanth Reddy: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో జర్మనీ కాన్సుల్ జనరల్ మైకేల్ హాస్పర్ బృందం భేటీ అయ్యింది. డ్యుయిష్ బోర్స్ ( Deutsche Borse) కంపెనీ విస్తరణలో భాగంగా హైదరాబాద్‌లో ఇవాళ తమ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్(GCC)ని ప్రారంభిస్తున్నట్లు ముఖ్యమంత్రికి జర్మనీ బృందం వివరించింది. GCC ఏర్పాటుకు హైదరాబాద్‌ను ఎంచుకున్నందుకు జర్మనీ బృందానికి సీఎం ధన్యవాదాలు తెలిపారు.
CM Revanth Reddy : తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి, అంతర్జాతీయ పెట్టుబడుల ప్రోత్సాహం దిశగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వరుస సమావేశాలు నిర్వహించారు. కెనడా హైకమిషనర్ క్రిస్టోఫర్ కూటర్ బృందం ఆయనను కలిసింది. ఈ భేటీలో ఐటీ, ఫార్మా, ఏరోస్పేస్, డిఫెన్స్ మరియు అర్బన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ రంగాల్లో కెనడాతో భాగస్వామ్యం గురించి విస్తృతంగా చర్చించారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టుల వివరాలను సీఎం రేవంత్‌రెడ్డి కెనడా ప్రతినిధులకు వివరించారు. తెలంగాణలో పెట్టుబడులకు అనుకూల వాతావరణం ఉందని తెలియజేస్తూ,…
హైదరాబాద్ సమీపంలో కొత్త నగరాన్ని నిర్మించాలని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం అని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. 9 వర్టికల్ రంగాలకు ప్రత్యేకంగా న్యూసిటీ నిర్మాణం ఉంటుందని, కొత్త నగరం పేరు ‘భారత్ ఫ్యూచర్’ సిటీ అని చెప్పారు. భవిష్యత్ తరాలకు అవకాశాలను క్రియేట్ చేయడం తమ ప్రభుత్వం లక్ష్యం అని చెప్పారు. తెలంగాణ కొత్తగా ఏర్పడిన రాష్ట్రమైనా.. హైదరాబాద్‌కు ఎంతో ఘనమైన చరిత్ర ఉందన్నారు. యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ తన డ్రీమ్ అని,…
మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పరోక్షంగా విమర్శలు చేశారు. తెలంగాణలో ఒక ట్రంప్ ఉండేవారని, తెలంగాణ ప్రజలు ఆ ట్రంప్‌ను పక్కన పడేశారని ఎద్దేవా చేశారు. ఇష్టరాజ్యంగా పరిపాలన నడిపించే వారు ఎవరైనా ట్రంప్ అవుతారు అని పేర్కొన్నారు. రాత్రి నిద్రలో ఏదైనా ఆలోచన వస్తే.. మరుసటి రోజు ఆర్డర్ ఇవ్వడం చాలా రోజులు నడవదు అని సీఎం విమర్శించారు. పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా సీఎం రేవంత్ ఢిల్లీ పర్యటన…
ఢిల్లీ పర్యటనలో ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రంలో పెట్టుబడులకు సంబంధించిన కీలక సమావేశాల్లో పాల్గొననున్నారు. దేశ రాజధాని ఢిల్లీలో జరుగుతున్న పబ్లిక్ అఫైర్స్ ఫోరం ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఢిల్లీలో జరుగుతున్న 12వ వార్షిక సదస్సుకు ముఖ్య అతిథిగా సీఎం రేవంత్ హాజరై.. “విజన్ తెలంగాణ – తెలంగాణ రైజింగ్” అంశంపై ప్రసంగించనున్నారు. తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుంది. అందులో భాగంగా వివిధ దేశాల ప్రతినిధులతో సీఎం రేవంత్ రెడ్డి…
దేశ విదేశాలు తిరుగుతూ పెట్టుబడుల కోసం ఎంతో ప్రయత్నిస్తున్నాం అని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. విదేశీ సంస్థలను ప్రోత్సహించిన తాము.. ఈ దేశ, రాష్ట్ర సంస్థలను ఎందుకు ప్రోత్సహించమో జర ఆలోచించాలన్నారు. మిమ్మల్ని (రాష్ట్ర సంస్థలు) ఎందుకు వదులుకుంటాం అని, అపోహలు సృష్టించే వాళ్లతో ప్రయాణిస్తే ఇలాగే ఉంటుందని పేర్కొన్నారు. ప్రభుత్వ విధానపరమైన నిర్ణయాల్లో పారదర్శకత ఉండాలని, అప్పుడే అభివృద్ధి పరుగులు పెడుతుందన్నారు. పెట్టుబడులకు రక్షణ కల్పించడమే కాదు, లాభాలు వచ్చేలా ప్రోత్సహించే బాధ్యత తనది…
CM Revanth Reddy : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు ఉదయం ఢిల్లీకి బయలుదేరారు. ఆయనతో పాటు నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఐటీ, పరిశ్రమలు, వాణిజ్య శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు కూడా ఈ రెండు రోజుల పర్యటనలో పాల్గొంటున్నారు. ఈ పర్యటనలో భాగంగా, ఉదయం 11 గంటలకు ఇంగ్లండ్ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్‌తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని బృందం సమావేశం కానుంది. ప్రస్తుతం టోనీ…
జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని బ్రహ్మోస్ ఏరోస్పేస్ ప్రతినిధి బృందం మర్యాదపూర్వకంగా కలిసింది. బ్రహ్మోస్ ఏరోస్పేస్ ఎండీ & సీఈవో డా, జైతీర్థ్ ఆర్. జోషి, బ్రహ్మోస్ హైదరాబాద్ ఎక్జిక్యూటివ్ డైరెక్టర్ సూరంపూడి సాంబశివ ప్రసాద్, డీఆర్డీఎల్ డైరెక్టర్ జీ.ఏ. శ్రీనివాస మూర్తి, తదితరులు సీఎంతో భేటీ అయ్యారు. హైదరాబాద్ లో బ్రహ్మోస్ ఏరోస్పేస్ సంస్థను విస్తరించాలని సీఎం కోరారు. హైదరాబాద్, బెంగుళూరు డిఫెన్స్ కారిడార్ ఏర్పాటు చేసేందుకు అనుకూలమైనవని రేవంత్ వివరించారు.
CM Revanth Reddy : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం జపాన్ పర్యటన విజయవంతంగా ముగిసింది. ఈ పర్యటన ద్వారా రాష్ట్రానికి భారీ స్థాయిలో పెట్టుబడులు, ఉద్యోగావకాశాలు వచ్చాయి. ఇప్పటివరకు మొత్తం రూ.12,062 కోట్ల విలువైన పెట్టుబడులు, దాదాపు 30,500 ఉద్యోగాలు ఈ పర్యటన ద్వారా సాధ్యమయ్యాయి. ముఖ్య ఒప్పందాలు – కీలక వివరాలు: మారుబెని కంపెనీ : హైదరాబాద్ ఫ్యూచర్ సిటీలో నెక్స్ట్ జనరేషన్ ఇండస్ట్రియల్…