Telangana Hotels on Strike: తెలంగాణలో హోటల్స్ బంద్.? గ్యాస్ సెగతో అసోసియేషన్ కీలక నిర్ణయం..!
- కమర్షియల్ గ్యాస్ కొరతతో సంక్షోభంలో హోటల్ పరిశ్రమ
- హైదరాబాద్‌లో అత్యవసర సమావేశం నిర్వహించిన అసోసియేషన్
- గ్యాస్ లేకపోతే హోటళ్లు బంద్ చేస్తామని హెచ్చరిక
- హోటల్ పరిశ్రమకు వెంటనే పరిష్కారం కోరుతున్న యజమానులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Telangana Hotels on Strike: తెలంగాణ రాష్ట్రంలోని హోటల్ పరిశ్రమ తీవ్రమైన సంక్షోభంలో చిక్కుకుంది. అంతర్జాతీయ యుద్ధ పరిణామాల నేపథ్యంలో కమర్షియల్ గ్యాస్ సరఫరా నిలిచిపోవడంతో, రాష్ట్రవ్యాప్తంగా హోటళ్లను మూసివేసి (బంద్) నిరసన తెలపాలని తెలంగాణ హోటల్స్ అసోసియేషన్ యోచిస్తోంది. దీనిపై చర్చించేందుకు హైదరాబాద్‌లో అసోసియేషన్ ప్రతినిధులు అత్యవసరంగా సమావేశమయ్యారు.
ప్రస్తుతం కొనసాగుతున్న ఇరాన్-ఇజ్రాయెల్, యూఎస్ యుద్ధం కారణంగా దేశవ్యాప్తంగా గ్యాస్ కొరత ఏర్పడిందని, అది ఇప్పుడు హోటళ్లపై తీవ్ర ప్రభావం చూపుతోందని అసోసియేషన్ వెల్లడించింది. ఇప్పటికే బెంగళూరు , ముంబై వంటి నగరాల్లో హోటల్ యజమానులు బంద్ నిర్వహిస్తుండగా, అదే బాటలో తెలంగాణలో కూడా కార్యకలాపాలు నిలిపివేయాలని నిర్ణయించనున్నారు. కమర్షియల్ గ్యాస్ సరఫరా లేకపోవడంతో వినియోగదారులకు కనీసం వంట చేసి పెట్టే పరిస్థితి కూడా లేదని యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Also Read
Israel-Lebanon: లెబనాన్‌పై మరోసారి ఇజ్రాయెల్ దాడులు.. హిజ్బుల్ స్థావరాలే లక్ష్యంగా ఎటాక్
ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్షుడు వెంకటరెడ్డి మాట్లాడుతూ.. హోటల్ పరిశ్రమకు గ్యాస్ అనేది ప్రాణవాయువు వంటిదని పేర్కొన్నారు. “ప్రస్తుతం గ్యాస్ నిల్వలు పూర్తిగా తగ్గిపోయాయి. హోటళ్లలో పని చేసే సిబ్బందికి కూడా వంట చేసి పెట్టేంత గ్యాస్ నిల్వలు లేని దుస్థితి ఏర్పడింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే స్పందించి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలి. లేనిపక్షంలో హోటళ్లను శాశ్వతంగా మూసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది” అని ఆయన హెచ్చరించారు.
ఈ సమావేశం ద్వారా తమ సమస్యను ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లడమే కాకుండా, తదుపరి ఏ విధమైన ఆందోళనలు చేపట్టాలనే దానిపై అసోసియేషన్ ఒక స్పష్టమైన ప్రణాళికను సిద్ధం చేస్తోంది. గ్యాస్ సరఫరా పునరుద్ధరించకపోతే ప్రజలకు ఆహారం అందించడం అసాధ్యమని, ఇది పరోక్షంగా వేలాది మంది కార్మికుల ఉపాధిపై కూడా ప్రభావం చూపుతుందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
BCCI Cash Reward: రూ. 131 కోట్లతో టీమిండియా ఆటగాళ్లపై డబ్బుల వర్షం కురిపిస్తున్న బీసీసీఐ..!
తాజావార్తలు
-
NIA Raids : ఆపరేషన్ సిందూర్ ఎఫెక్ట్.. రామగుండంలో NIA మెరుపు దాడులు
-
Off The Record: ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలకు కేటీఆర్ వార్నింగ్..?
-
AP Liquor Scam Case: కారుమూరి అరెస్ట్‌పై ఈడీ కీలక ప్రకటన
-
Chairmans Desk : కాంగ్రెస్‌లో పాతకథ పునరావృతమౌతోందా.. రేవంత్ తక్షణ కర్తవ్యమేంటి..?
-
OTR: ప్రభాకర్ చౌదరి ఆరోపణలకు స్పందించని ఎమ్మెల్యే దగ్గుబాటి.. కారణం ఇదేనా..?
ట్రెండింగ్
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?
-
50MP కెమెరా, 120Hz AMOLED డిస్ప్లే,7,050mAh బ్యాటరీతో Vivo V80 Lite 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
EPFO హెచ్చరిక.. 10 ఏళ్ల సర్వీస్ పూర్తికాకముందే PF విత్‌డ్రా చేస్తే పెన్షన్‌పై ప్రభావం..!
-
IP Ratings: IP67, IP68, IP69 అంటే ఏమిటి? స్మార్ట్‌ఫోన్ కొనేముందు ఈ వాటర్‌ప్రూఫ్ రేటింగ్స్ గురించి తప్పక తెలుసుకోండి.!
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!