Arabian Mandi : హైదరాబాద్ నగరం రోజురోజుకు అభివృద్ధి చెందుతూ, ఐటీ హబ్‌గా, వాణిజ్య కేంద్రంగా మారుతోంది. ఈ అభివృద్ధికి అనుగుణంగా రెస్టారెంట్లు, హోటళ్ల సంఖ్య కూడా గణనీయంగా పెరుగుతోంది. నగరవాసుల జీవన శైలిలో మార్పుల కారణంగా రెస్టారెంట్లపై ఆదరణ పెరిగినా, అందులో అందిస్తున్న ఆహార నాణ్యతపై తీవ్రమైన విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పలు హోటళ్లలో ఆహార నాణ్యత మాంద్యం చెందడం, అపరిశుభ్ర వాతావరణంలో ఆహారం సిద్ధం కావడం తీవ్ర సమస్యగా మారింది. ఫుడ్ సేఫ్టీ అధికారులు నిరంతరం…