NTV Telugu Site icon

High Court Telangana : ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్‌పై హైకోర్టులో వాదనలు పూర్తి.. తీర్పు రిజర్వ్

Tg High Court

Tg High Court

High Court Telangana : తెలంగాణలో పార్టీలో ఫిరాయించిన ఎమ్మెల్యేలకు అనర్హత విధించేందుకు సంబంధించి హైకోర్టులో మంగళవారం విచారణ ముగిసింది. అసెంబ్లీ కార్యదర్శి దాఖలు చేసిన అప్పీల్‌పై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజే) ధర్మాసనం వాదనలు విని తీర్పును రిజర్వు చేసింది. ఈ సందర్భంగా, బీఆర్‌ఎస్‌ (BRS) తరఫున సీనియర్ న్యాయవాది మోహన్‌రావు వాదనలు వినిపించారు. సింగిల్‌ జడ్జి తీర్పుపై అప్పీల్‌ చేసే అర్హత అసెంబ్లీ కార్యదర్శికి లేదన్నారు.

Marco Rubio: భారత మద్దతుదారుడే అమెరికా విదేశాంగ కార్యదర్శి.. ట్రంప్ కీలక ఎంపిక..!

అసెంబ్లీ స్పీకర్‌ పక్షాన నిర్ణయం తీసుకోవాల్సిన బాధ్యత ఉందని చెప్పారు. అలాగే, అసెంబ్లీ కార్యదర్శి దాఖలు చేసిన అప్పీల్‌కు విచారణ అర్హత లేదు అనే వాదనను కూడా హైకోర్టుల న్యాయమూర్తి ముందుకు పెట్టారు. ఇప్పటికే, ఈ కేసు పై సింగిల్ జడ్జి తీర్పు వచ్చిన నేపధ్యంలో, స్పీకర్‌కు అనర్హత పిటిషన్లపై సకాలంలో నిర్ణయం తీసుకోవాల్సిన బాధ్యత ఉన్నట్లు సూచించబడింది. ఇరు పక్షాల వాదనలు విన్న హైకోర్టు ధర్మాసనం, మరింత విచారణ చేపట్టకుండా తీర్పును రిజర్వు చేసింది.

Stock Market: భారీ నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్