Telangana Rains: తెలంగాణలో రెండు రోజులు అత్యంత భారీ వర్షాలు…
- బంగాళాఖాతంలో అల్పపీడనం.. రాష్ట్రంలో వర్షాల ముప్పు పెరుగుదల
- నేడు జిల్లాల వారీగా రెడ్, ఆరెంజ్, ఎల్లో అలర్ట్‌లు
- మెదక్, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలకు రెడ్ అలర్ట్
- ప్రజలకు వాతావరణ శాఖ సూచించిన జాగ్రత్తలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Telangana Rains: రాష్ట్రంలో వర్షాల పరిస్థితి మరింత తీవ్రమవుతున్న నేపధ్యంలో, వాతావరణ శాఖ రాబోయే మూడు రోజులకు భారీ వర్షాల హెచ్చరికలు జారీ చేసింది. ఇప్పటికే పలు ప్రాంతాల్లో కుండపోత వర్షాలు కురుస్తుండగా, రానున్న రోజుల్లో ఈ పరిస్థితి మరింత ఉధృతమవుతుందని అంచనా వేస్తోంది. వాతావరణ శాఖ ప్రకారం, బంగాళాఖాతంలో ఆగస్టు 13 (బుధవారం) నాటికి అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. రాబోయే 48 గంటల్లో ఇది మరింత బలపడనుందని అధికారులు అంచనా వేస్తున్నారు. మరోవైపు, ఉత్తర అంతర్గత కర్ణాటక, దాని పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఇది సముద్ర మట్టం నుంచి సగటున 5.8 కి.మీ ఎత్తులో ఉన్నట్లు గుర్తించారు. ఈ రెండు వాతావరణ వ్యవస్థల ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది.
మంగళవారం (ఆగస్టు 13) రోజున తెలంగాణలోని హన్మకొండ, జనగాం, మహబూబాబాద్, వరంగల్, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున రెడ్ అలర్ట్ జారీ చేశారు. భద్రాద్రి కొత్తగూడెం, హైదరాబాద్, జయశంకర్ భూపాలపల్లి, కరీంనగర్, మేడ్చల్ మల్కాజ్గిరి, ములుగు, పెద్దపల్లి, రంగారెడ్డి, సిద్దిపేట జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేయబడింది. అదే విధంగా ఆదిలాబాద్, జగిత్యాల, కొమురం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో భారీ వర్షాల అవకాశం ఉన్నందున ఎల్లో అలర్ట్ జారీ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఉరుములు, మెరుపులు, గంటకు 40–50 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశముందని కూడా పేర్కొన్నారు.
Also Read
- PSCMS : ఇక ప్రైవేట్ స్కూళ్లకు చుక్కలే.. రంగంలోకి తెలంగాణ విద్యాశాఖ 'ఆన్లైన్ ఫిర్యాదుల' అస్త్రం.!
- Sanjush : రోడ్డు ప్రమాదంలో లైఫ్‌స్టైల్ ఉద్యోగిని మృతి.. జనసేన ఎంపీ కుమారుడిపై కేసు
- OTR: ప్రభుత్వానికి సలహాలు ఇస్తున్నారా? లేక పవర్, ప్రోటోకాల్ ఎంజాయ్ చేస్తున్నారా?
- OTR : సుస్మిత వ్యాఖ్యలతో కొండా సురేఖకు చిక్కులు? పదవిపై కత్తి వేలాడుతుందా?
Sruthihasson : అందుకే నాకు బ్లాక్ కలర్ అంటే ప్రాణం..
బుధవారం (ఆగస్టు 14) రోజున మెదక్, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాల హెచ్చరికలతో రెడ్ అలర్ట్ ప్రకటించారు. భద్రాద్రి కొత్తగూడెం, హనుమకొండ, హైదరాబాద్, జనగాం, ఖమ్మం, మహబూబాబాద్, మేడ్చల్ మల్కాజ్గిరి, నల్గొండ, రంగారెడ్డి, సిద్దిపేట, సూర్యాపేట, వరంగల్, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాల అవకాశం ఉన్నందున ఆరెంజ్ అలర్ట్ ఇచ్చారు. అలాగే ఆదిలాబాద్, జగిత్యాల, జయశంకర్ భూపాలపల్లి, కరీంనగర్, కొమురం భీమ్ ఆసిఫాబాద్, ములుగు, నిజామాబాద్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ఎల్లో అలర్ట్ జారీ చేశారు.
వాతావరణ శాఖ అధికారులు, రానున్న మూడు రోజులపాటు రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు, ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులు విస్తారంగా ఉంటాయని స్పష్టం చేశారు. ప్రత్యేకించి రెడ్, ఆరెంజ్ అలర్ట్ ఉన్న జిల్లాల్లో నివసించే ప్రజలు అనవసరంగా బయటకు వెళ్లకుండా జాగ్రత్తలు పాటించాలని సూచించారు. నీటి ముంపు ప్రాంతాల్లో నివసించే ప్రజలు ముందస్తు చర్యలు తీసుకోవాలని, అధికారుల సూచనలను పాటించాలని సూచించారు.
Tollywood Bundh : 10వ రోజుకు చేరుకున్న టాలీవుడ్ బంద్.. ఈ రోజు సమ్మె విరమణకు ఛాన్స్
తాజావార్తలు
-
Deepika Padukone Spirit Exit: లాభాల్లో 10% వాటా డిమాండ్, లీక్స్.. ప్రణయ్ వంగ సంచలన వ్యాఖ్యలు!**
-
Mahesh – Sandeep Vanga: స్పిరిట్ తర్వాత మహేష్ బాబు-సందీప్ రెడ్డి వంగ కాంబో?
-
Spirit : స్పిరిట్ ఎన్ని వేల కోట్లు..?
-
Sandeep Vanga : Spirit సెట్ లో అందరికి కోటింగ్…ప్రణయ్ రెడ్డి సంచలన కామెంట్స్
-
Google Offers For Students: విద్యార్థులకు గూగుల్ బంపరాఫర్.. రూ.4,800 విలువైన ఏఐ సబ్స్క్రిప్షన్ ఫ్రీ.. ఎప్పటి వరకు అంటే..?
ట్రెండింగ్
-
Home Decoration Ideas : వరలక్ష్మీ వ్రతం 2026.. తక్కువ బడ్జెట్లో ఇంటికి పండుగ లుక్.!
-
50 గంటల బ్యాటరీ, 42ms లో లేటెన్సీతో రూ.1,899కే iQOO Buds లాంచ్.. గేమర్లకు బెస్ట్ TWS.!
-
రూ.1,999కే CMF Buds Neo.. 35dB ANC, 52 గంటల బ్యాటరీ లైఫ్‌తో అదిరిపోయే ఇయర్‌బడ్స్..!
-
144Hz AMOLED డిస్ప్లే, 7050mAh బ్యాటరీతో iQOO Z11 వచ్చేసిందోచ్.. ధర ఎంతంటే.?
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ రూమర్స్.. ముంబై ఇండియన్స్ పోస్ట్ వైరల్.. హింట్ ఇచ్చేసిందా?