ఇంట్లో కూడా మాస్కు ధరించాల్సిందే: తెలంగాణ హెల్త్ డైరెక్టర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణలో ఒమిక్రాన్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. దీంతో తెలంగాణ ఒమిక్రాన్ కేసుల సంఖ్య 9కి చేరింది. తాజాగా హన్మకొండ, హైదరాబాద్ చార్మినార్ ప్రాంతాలలో కొత్త కేసులు నమోదయ్యాయని తెలంగాణ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు వెల్లడించారు. శంషాబాద్ విమానాశ్రయంలో సేకరించిన నమూనాల్లో 9మందికి ఒమిక్రాన్ నిర్ధారణ అయిందన్నారు. వీరిలో 8 మంది రాష్ట్రంలోకి ప్రవేశించారని, మరో వ్యక్తి పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి చెందినవాడన్నారు. ఇప్పటివరకు సామాజిక వ్యాప్తి జరగలేదని స్పష్టం చేశారు.
Read Also: హన్మకొండలో ఒమిక్రాన్ కలకలం..ఓ మహిళకు పాజిటివ్
Also Read
- Governor Abdul Nazeer: డిప్యూటీ సీఎంను ఇంటికెళ్లి పరామర్శించిన గవర్నర్.. పవన్ కల్యాణ్ లైబ్రరీ సందర్శన..
- Bhatti Vikramarka : సీతారామ ప్రాజెక్టుపై భట్టి కీలక ప్రకటన.. ఇక వెనక్కి తగ్గేది లేదు..
- TGEAPCET 2026: రేపటి నుంచి రెండో విడత ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ప్రారంభం..!
- Bonalu: నేటి నుంచి ఆషాఢ బోనాల సందడి షురూ.. గోల్కొండ జగదాంబిక అమ్మవారితో వైభవంగా బోనాల ఆరంభం..!
ఒమిక్రాన్ సోకడానికి వ్యాక్సిన్ తీసుకోకపోవడం కూడా ఒక కారణమని తెలంగాణ డీహెచ్ శ్రీనివాసరావు అన్నారు. యూకేలో టీకా తీసుకోని వారిలో మాత్రమే ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని చెప్పారు. జ్వరం, తలనొప్పి, ఒళ్లునొప్పులు, దగ్గు, నీరసం లాంటి లక్షణాలు కనిపిస్తే టెస్టులు చేయించుకోవాలన్నారు. కొద్ది వారాల పాటు ఇంట్లో కూడా మాస్కు ధరించాలని సూచించారు. గాలి, వెలుతురు వచ్చేలా తలుపులు, కిటికీలు తెరుచుకోవాలని హితవు పలికారు. కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని… రాష్ట్రంలో ఎలాంటి లాక్డౌన్లు, ఆంక్షలు ఉండవని స్పష్టం చేశారు. అయితే నిర్లక్ష్యంగా మాత్రం ఉండొద్దన్నారు. ఇంకా తెలంగాణలో 28 లక్షల మంది సెకండ్ డోస్ వ్యాక్సిన్ తీసుకోవాల్సి ఉందన్నారు.
తాజావార్తలు
-
TMC Crisis: మమతా బెనర్జీకి మరో షాక్.. రాజ్యసభకు కోయెల్ మల్లిక్ రాజీనామా
-
OnePlus: ఇండియాను వదిలి వెళ్లి పోతున్న వన్ ప్లస్..? క్లారిటీ..
-
Delimitation Bill: డీలిమిటేషన్ బిల్లు.. మిషన్ 360పై మోడీ సర్కార్ ఫోకస్..
-
Hair Growth Tips: జుట్టు గుత్తులు గుత్తులుగా రాలిపోతోందా?.. ఈ చిట్కాలు చాలు..
-
Sujeeth: సైలెంట్‌గా పని కానిచ్చేస్తున్న స్టార్ డైరెక్టర్..
ట్రెండింగ్
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?
-
TGEAPCET 2026: రేపటి నుంచి రెండో విడత ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ప్రారంభం..!
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్‌లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్‌లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!