CM Revanth Reddy: నీళ్ల నివాసాన్ని ఆక్రమిస్తే.. మన నివాసాలనే ఆక్రమిస్తాయి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నీళ్ల నివాసాన్ని మనం ఆక్రమిస్తే, ఆ నీళ్లే మన నివాసాలను ఆక్రమిస్తాయని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరించారు. తమ్మిడికుంట చెరువు ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొని మాట్లాడుతూ.. నిజాం కాలంలోనే మూసీ పరివాహక ప్రాంతాల ప్రాధాన్యతను గుర్తించారని, అయితే కాలక్రమేణా అది కబ్జాల బారిన పడి నల్గొండ ప్రజలకు శాపంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే మూసీ ప్రక్షాళన చేపట్టి విశ్వనగరంగా హైదరాబాద్‌ను తీర్చిదిద్దుతామని, ఈ క్రమంలో ఏ ఒక్కరికీ అన్యాయం జరగదని స్పష్టం చేశారు.
తమ్మిడికుంట చెరువు అభివృద్ధికి సినీ నటుడు నాగార్జున ముందుకు రావడం అభినందనీయమని, ఆయన నిజమైన హైదరాబాదీ అని కొనియాడారు. 1,370 చెరువులలో సగం మాయమవ్వడం వల్లే చిన్న వర్షానికి నగరంలో వరదలు వస్తున్నాయని వివరించారు. తమ్మిడికుంటను ‘లేక్ ఎకానమీ’గా మార్చి, స్వయం శక్తి సంఘాలకు స్టాల్స్ కేటాయించాలని, వర్క్ ఫ్రమ్ హోమ్ సదుపాయాలు కల్పించి, అక్కడ జమ్మి చెట్టు నాటాలని అధికారులను ఆదేశించారు.
Also Read
- AP Elections: ఎస్ఈసీ కీలక సమావేశం.. రేపే పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్..
- Goree Beauty Cream: భారత్‌లో పాకిస్తానీ ఫెయిర్‌నెస్ క్రీమ్.. వాడితే కిడ్నీలు ఖతం..
- Holiday Cancel: కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ ప్రభుత్వం.. రెండో శనివారం సెలవు క్యాన్సిల్..
- Qualcomm Layoffs: ఐఐటీ డిగ్రీ, రూ. 26 లక్షల ప్యాకేజ్.. లేఆఫ్స్‌లో రోడ్డున పడ్డ ఇంజనీర్!
ఈ సందర్భంగా సినీ నటుడు అక్కినేని నాగార్జున మాట్లాడుతూ.. తమ్మిడికుంట చెరువును ఎంతో అందంగా తీర్చిదిద్దారని ప్రశంసించారు. నీళ్లు, చెరువుల సంరక్షణపై సీఎం రేవంత్ రెడ్డికి ఉన్న ఆసక్తిని కొనియాడుతూ, 2 వేల చెరువులను ఇలాగే పునరుద్ధరించాలని విజ్ఞప్తి చేశారు. మనం మన పిల్లలకు ఇచ్చే అతిపెద్ద ఆస్తి మంచి ప్రకృతేనని చెప్పారు. శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ మాట్లాడుతూ.. చెరువు అభివృద్ధితో ఈ ప్రాంత స్వరూపమే మారిపోయిందని ఆనందం వ్యక్తం చేశారు. ప్రారంభంలో వ్యతిరేకత వచ్చినా, ఇప్పుడు 80 శాతం మంది అనుకూలంగా మాట్లాడుతున్నారని తెలిపారు. తాను కూడా 10 చెరువులను దత్తత తీసుకుంటున్నట్లు ప్రకటించారు.
హైడ్రా కమిషనర్ రంగనాథ్ మాట్లాడుతూ. ఒకప్పుడు భయపడే పరిస్థితి ఉన్న తమ్మిడికుంటను 15 ఎకరాల నుంచి 30 ఎకరాలకు విస్తరించి అభివృద్ధి చేశామన్నారు. నాళాల ద్వారా నీరు చేరేలా చర్యలు తీసుకున్నామని, వరదల నివారణకు చెరువుల పునరుద్ధరణ అత్యంత కీలకమని, హైడ్రాకు యువత మద్దతు లభిస్తోందని చెప్పారు.
తాజావార్తలు
-
CM Revanth Reddy: నీళ్ల నివాసాన్ని ఆక్రమిస్తే.. మన నివాసాలనే ఆక్రమిస్తాయి..
-
Gautam Ghattamaneni: నితీశ్ తివారీ ‘రామాయణ’కు మహేశ్ బాబు కొడుకు దిమ్మతిరిగే రేటింగ్.. గౌతమ్ రివ్యూ వైరల్!
-
AP Elections: ఎస్ఈసీ కీలక సమావేశం.. రేపే పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్..
-
Homemade Recipes: రొటీన్ పచ్చళ్లు బోర్ కొట్టాయా? ఈ పచ్చడి ట్రై చేయండి.. ఒక్క ముద్ద తిన్నా వదిలిపెట్టరు!
-
January 12 Vidudala: సంక్రాంతి రేసులో ముందే దూకుడు.. అమెరికాలో సందడి చేయనున్న ‘జనవరి 12 విడుదల’ టీమ్!
ట్రెండింగ్
-
iPhoneకు పోటీగా Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. Motorola Razr Flex పేరుతో రంగం సిద్ధం..!
-
Captain Sanju Samson: పుట్టినరోజున కెప్టెన్‌గా సంజూ శాంసన్‌కు ప్రమోషన్..
-
Egg Lababdar Recipe: ఎగ్ లవర్స్ కోసం పర్ఫెక్ట్ డిష్.. రెస్టారెంట్ స్టైల్ సూపర్ టేస్టీ “ఎగ్ లబాబ్దార్” సులువుగా చేసుకోండి ఇలా..!
-
How to Make Hara Saag: పప్పు తిని విసుగొచ్చిందా? తాజా ఆకుకూరలతో వింటర్ స్పెషల్ డిష్ ట్రై చేయండి..
-
IPL 2027 Trade: పంజాబ్ కింగ్స్‌కు హార్థిక్ పాండ్యా.. ముంబైకి ఆర్షదీప్ సింగ్.. ఇట్స్ అఫీషియల్..!