Nursing Jobs : తెలంగాణ ఆరోగ్య శాఖలో కొలువుల జాతర..
- ఆరోగ్య శాఖలో 2,322 నర్సింగ్ పోస్టుల భర్తీ పూర్తి
- 42 వేల అభ్యర్థుల నిరీక్షణకు ముగింపు
- రెండు సంవత్సరాల్లో రికార్డు స్థాయిలో నియామకాలు
- జూన్ నాటికి మరో 4,500 పోస్టుల భర్తీ లక్ష్యం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ సర్కార్ నిరుద్యోగులకు మరో భారీ కానుకను అందించబోతోంది. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖలో ఖాళీగా ఉన్న 2,322 నర్సింగ్ ఆఫీసర్ పోస్టుల భర్తీ ప్రక్రియను మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డు (MHSRB) విజయవంతంగా పూర్తి చేసింది. ఈ పోస్టులకు సంబంధించిన తుది ఫలితాలను (Final Selection List) మరికాసేపట్లో బోర్డు అధికారికంగా విడుదల చేయనుంది.
ఈ నోటిఫికేషన్ ద్వారా ప్రభుత్వ ఆసుపత్రుల్లో నర్సింగ్ ఆఫీసర్లుగా పనిచేయడానికి సుమారు 42,000 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకుని, పరీక్షలకు హాజరయ్యారు. గత కొంతకాలంగా ఫలితాల కోసం వేచి చూస్తున్న ఈ అభ్యర్థుల నిరీక్షణకు నేటితో తెరపడనుంది. ఎంపికైన అభ్యర్థుల జాబితా బోర్డు వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచనున్నారు.
AP Cabinet: 31 ప్రాజెక్టులు.. రూ.39,436 కోట్లు.. ఏపీ కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు..!
Also Read
- Food Poisoning: జగిత్యాల జిల్లాలో విషాదం.. పెళ్లి భోజనం తిని 15 మందికి అస్వస్థత..
- TG SAFE: ఫుడ్ లవర్స్ అలర్ట్.. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న చట్నీస్, పిస్తా హౌస్ సహా ఈ 7 రెస్టారెంట్లు!
- Telangana Assembly: తెలంగాణ అసెంబ్లీ, మండలి సమావేశాల ముహూర్తం ఖారారు..
- Metro Rail: ఓల్డ్ సిటీలో ఊపందుకున్న మెట్రో రైలు పనులు.. అధికారులకు ఎండీ కీలక ఆదేశాలు..
రాష్ట్ర ఆరోగ్య శాఖలో ఈ రెండేళ్ల కాలంలోనే రికార్డు స్థాయిలో నియామకాలు జరుగుతున్నాయి. కేవలం రెండు రోజుల క్రితమే మంత్రి దామోదర్ రాజనర్సింహ చేతుల మీదుగా 866 మంది డాక్టర్లకు నియామక పత్రాలు అందిన విషయం తెలిసిందే. గత రెండేళ్లలో ప్రభుత్వం ఇప్పటికే 10,327 ఉద్యోగాలను భర్తీ చేసింది. తాజాగా విడుదలవుతున్న 2,322 నర్సింగ్ పోస్టులతో కలిపి, మొత్తం భర్తీ ప్రక్రియ 12,649 మైలురాయిని చేరుకుంది. ప్రభుత్వం ఇక్కడితోనే ఆగకుండా, ఆరోగ్య శాఖను మరింత బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తోంది.
ప్రస్తుతం భర్తీ ప్రక్రియలో మరో 4,500 పోస్టులు ఉన్నాయి. వీటన్నింటినీ జూన్ నెలాఖరు నాటికి పూర్తి చేసి, అర్హులైన అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేసేలా బోర్డు వేగంగా కసరత్తు చేస్తోంది. వైద్య సేవలను సామాన్యులకు మరింత చేరువ చేయాలన్న లక్ష్యంతో ప్రభుత్వం చేపట్టిన ఈ భారీ నియామక ప్రక్రియ పట్ల నిరుద్యోగ నర్సింగ్ అభ్యర్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
తాజావార్తలు
-
Kapil Dev: ఫాలో ఆన్ ఇచ్చి కూడా గెలవలేరా? కపిల్ దేవ్ ప్రశ్నల వర్షంతో టీమిండియాలో ప్రకంపనలు..
-
NASA: అంగారక గ్రహంపై ఏలియన్ ‘జెల్లీఫిష్’ కలకలం.. నాసా ఫొటోతో వెలుగులోకి షాకింగ్ విషయాలు..
-
Food Poisoning: జగిత్యాల జిల్లాలో విషాదం.. పెళ్లి భోజనం తిని 15 మందికి అస్వస్థత..
-
Emraan Hashmi: సినిమా సక్సెస్ జోష్లో ఇమ్రాన్ హష్మీకి బిగ్ షాక్.. స్వైన్ ఫ్లూ పాజిటివ్!
-
T20 Cricket: కేవలం 7 పరుగులకే ఆలౌట్, 10 రన్స్కే కుప్పకూలిన జట్లు, టీ20 చరిత్రలోనే అత్యంత దారుణ స్కోర్లు ఇవే!
ట్రెండింగ్
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!