తెలంగాణ రాష్ట్రంలోని మహిళలకు శుభవార్త. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ చీరలు పంపిణీకి సర్వం సిద్ధమైంది. మాజీ ప్రధాని ‘ఇందిరా గాంధీ’ జయంతి సందర్భంగా ఇందిరా మహిళా శక్తి చీరలు పంపిణీ కార్యక్రమాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. ఈ విషయాన్ని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా మహిళల సాధికారత కోసం ప్రభుత్వం కోటి మహిళా శక్తి చీరలు పంపిణీ చేస్తోందని ఆయన చెప్పారు. నెక్లెస్ రోడ్డులో మధ్యాహ్నం 12 గంటలకు ఇందిరమ్మ…