పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి నేతృత్వంలో ధరణి వల్ల ప్రజల కష్టాలపై చర్చ జరిగిందన్నారు ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్. ధరణి వల్ల లక్షలాది మంది యజమానులు రికార్డులు పట్టుకొని బిచ్చగాళ్ల లాగా ఎమ్మార్వో ఆఫీస్ ల ముందు తిరుగుతున్నారని విమర్శించారు. భూ సర్వే చేసి..రికార్డుల సవరణ చేయాల్సింది. ప్రభుత్వం అనాలోచితంగా ధరణి విధానాన్ని తీసుకొచ్చింది. ఎక్స్ సర్వీస్ మెన్ తమ భూమికి కూడా వాళ్ళు ఓనర్లుకాదని ధరణి చూపుతుంది. అనేక సర్వే నంబర్లు మిస్సయ్యాయి..మ్యుటేషన్…
తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తెచ్చిన ధరణి వెబ్సైట్ లో భారీ మార్పులకు సిద్ధమైంది. నిషేధిత భూముల తొలగింపు, కొత్త మాడ్యూల్స్ తో సమస్యల పరిష్కారం చూపించనుంది. వ్యవసాయ భూమిలో ఇండ్లు నిర్మించుకుంటే రైతుబందు అమలు నిలిపివేయనున్నారు. ధరణి అందుబాటులోకి వచ్చిన తర్వాత నిషేధిత జాబితాలోకి లక్షల ఎకరాల భూములు వెళ్లాయి. ధరణిలో రిజిస్ట్రేషన్ రద్దు చేసుకున్న డబ్బులు చెల్లించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ధరణిలో సమస్యల పై కలెక్టర్ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు వేలాది మంది రైతులు.…