Telangana: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ వెలువడిన తర్వాత రాష్ట్రంలో పరిస్థితులు వేగంగా మారుతున్నాయి. ఈ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించాలని భావించిన కేంద్ర ఎన్నికల సంఘం గతంలో ఎన్నడూ లేనివిధంగా ఒకేసారి 20 మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేసింది. ఎన్నికలు ముగిసే వరకు వారికి ఎలాంటి ఎన్నికల విధులు కేటాయించవద్దని సీఎస్‌ను ఆదేశించింది. నలుగురు కలెక్టర్లతో పాటు మరికొందరు పోలీసులు, ఇతర అధికారులను బదిలీ చేస్తూ కేంద్ర ఎన్నికల సంఘం పంపిన ఉత్తర్వులను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసింది. ఈ మేరకు ఆ స్థానాల్లో అధికారుల బదిలీలు, కొత్త అధికారుల నియామకానికి సంబంధించిన జాబితాను ప్యానెల్ సిద్ధం చేసి ఈసీకి పంపింది. రవాణా శాఖ కార్యదర్శి, ఎక్సైజ్ కమిషనర్, వాణిజ్య పన్నుల శాఖ డైరెక్టర్‌తో పాటు నలుగురు కలెక్టర్లు, ముగ్గురు సీపీలు, 10 మంది ఎస్పీలను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈసీ బుధవారం ఆదేశించింది. ఒక్కో పోస్టుకు ముగ్గురు అధికారులతో కూడిన ప్యానెల్ జాబితాను సిద్ధం చేసిన సీఎస్ శాంతికుమారి.. ఆ జాబితాను గురువారం ఈసీకి పంపారు. అందులో నుంచి ఒక్కో అధికారిని ఈసీ ఎంపిక చేస్తుంది. ఎంపికైన అధికారుల జాబితాను శుక్రవారం సాయంత్రంలోగా సీఎస్‌కు పంపనున్నారు. కాగా, ఒక్కో పోస్టుకు సీనియారిటీ ఆధారంగా ముగ్గురు అధికారుల పేర్లను పంపాలని సీఎస్‌ను ఈసీ ఆదేశించింది. ఆ మేరకు జాబితా సిద్ధం చేసి సీఎస్ ఈసీకి పంపారు.
హైదరాబాద్, వరంగల్, నిజామాబాద్ పోలీస్ కమిషనర్లతో పాటు 10 జిల్లాలకు ఎస్పీల పేర్లను డీజీపీ సీఎస్‌కు పంపారు. సీఎస్, జీఏడీ కార్యదర్శి కలిసి రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి, యాదాద్రి భువనగిరి, నిర్మల్ జిల్లా కలెక్టర్ పోస్టులకు పలువురు ఐఏఎస్‌ల పేర్లను ఎంపిక చేశారు. ఒక్కో జిల్లాకు ముగ్గురు చొప్పున మొత్తం 12 మంది ఐఏఎస్‌ల పేర్లను ఈసీకి పంపారు. ట్రాన్స్‌పోర్ట్ సెక్రటరీ, ఎక్సైజ్ కమిషనర్, కమర్షియల్ టాక్సెస్ డైరెక్టర్ పోస్టులకు ఒక్కొక్కరు ముగ్గురి పేర్లతో 9 మంది పేర్లను ప్రతిపాదించారు. మొత్తం 20 పోస్టులకు గానూ 60 మంది పేర్లను ఈసీకి పంపిన సంగతి తెలిసిందే. ఈసీ ఆదేశాల మేరకు ఒక్కో అధికారికి సంబంధించిన పూర్తి వివరాలను నివేదికలో పొందుపరిచారు. ప్రతి అధికారికి ఐదేళ్ల పనితీరు, విజిలెన్స్ నివేదికలు అందజేశారు.
హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ పై ఈసీ బదిలీ కావడంతో ఎవరిని నియమిస్తారన్నది ఆసక్తికరంగా మారింది. ఈ పోస్టు అడిషనల్ డీజీ హోదాలో ఉండటంతో ఆ హోదాలో ఉన్న సీనియర్ ఐపీఎస్ అధికారుల పేర్లను డీజీపీ పంపినట్లు తెలుస్తోంది. అదనపు డీజీల సీనియారిటీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి కాగా, శివధర్ రెడ్డి, అభిలాష్ బిస్త్, చికాగోయల్, వీవీ శ్రీనివాస్ రావు, మహేశ్ భగవత్, సజ్జనార్, నాగిరెడ్డి తర్వాత స్థానాల్లో ఉన్నారు. వీరిలో ముగ్గురి పేర్లు పంపాల్సి ఉండగా.. ఎవరి పేర్లు ఈసీకి వెళ్లాయన్నది ఆసక్తికరంగా మారింది. వరంగల్, నిజామాబాద్ కమిషనర్ పోస్టులకు ఐజీ ర్యాంక్ ఐపీఎస్ అధికారుల పేర్లను పంపారు. జిల్లాల్లో ఎస్పీల పోస్టింగ్‌లకు పలువురు ఐపీఎస్‌ల పేర్లు ప్రతిపాదించారు. మూడు కమిషనర్లు, 10 ఎస్పీ పోస్టుల కోసం 39 మంది పేర్లతో కూడిన జాబితాను సీఎస్ ఈసీకి పంపారు.
Pooja Hegde: బుట్టబొమ్మ బర్త్ డేకి ఒక్క సినిమా అప్డేట్ కూడా లేదేంటి?