ఇలియానా, కాజల్ అగర్వాల్, తమన్నాల తర్వాత ఆ రేంజులో స్టార్ స్టేటస్ అందుకున్న అతి తక్కువ మంది హీరోయిన్స్ లో పూజ హెగ్డే ఒకరు. తన అందంతో యూత్ ని ఆకట్టుకున్న ఈ బ్యూటీ, కెరీర్ స్టార్ట్ చేసిన తక్కువ సమయంలోనే స్టార్ హీరోలతో నటించేసింది. మహేష్ బాబు, అల్లు అర్జున్, రామ్ చరణ్, ఎన్టీఆర్, హ్రితిక్ రోషన్, దళపతి విజయ్… ఇలా అన్ని ఇండస్ట్రీల స్టార్ హీరోలతో నటించిన పూజా హెగ్డే సూపర్బ్ క్రేజ్ ని సొంతం చేసుకుంది. దీంతో పూజా హెగ్డే ఫొటోస్ బయటకి వచ్చినా అవి సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యేవి, అలాంటిది ఈరోజు పూజా హెగ్డే బర్త్ డే అయినా కూడా సోషల్ మీడియాలో సౌండ్ లేదు. ఏ సినిమా ప్రొడక్షన్ హౌజ్ నుంచి పూజా ఫస్ట్ లుక్ రిలీజ్ కాలేదు. బర్త్ డే విషెస్ చెప్తూ పూజా హెగ్డే కోసం పోస్టులు పెడుతున్నారు, సినిమాల పరంగా జీరో అప్డేట్స్. ఇలా జరగడం పూజా కెరీర్ లోనే మొదటిసారి.
2014 నుంచి ప్రతి సంవత్సరం ఏడాదికి కనీసం మూడు నాలుగు సినిమాలు చేసే పూజా హెగ్డేకి ప్రస్తుతం చేతిలో ఒక్క సినిమా కూడా లేదు. 2023లో పూజా హెగ్డే నటించింది ఒక్క సినిమాలోనే, అది కూడా హిందీ సినిమా అంటే తెలుగులో పూజా హెగ్డే కెరీర్ పరిస్థితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. 2023 అనే కాదు 2022లో కూడా పూజా హెగ్డే పరిస్థితి దాదాపు ఇలానే ఉంది. కాకపోతే 2022లో పూజా హెగ్డే పాన్ ఇండియా సినిమాలు చేసింది. రాధే శ్యాం, బీస్ట్, ఆచార్య, సర్కస్ సినిమాల్లో ఒకటి రెండు హిట్ అయినా బాగుండేది కానీ ఇందులో ఒక్క సినిమా కూడా హిట్ అవ్వలేదు. కొట్లలో నష్టాలు మిగిలించిన ఈ సినిమాలు పూజాకి ఐరన్ లెగ్ ముద్రని తెచ్చాయి. ఆమె ఏ సినిమాలో నటించినా, అది ఫ్లాప్ అవుతుంది అనే విమర్శలు కూడా మొదలయ్యాయి. ఇక్కడి నుంచే పూజా డౌన్ ఫాల్ స్టార్ట్ అయ్యింది, మరి ఈ బర్త్ డే బేబీ కంబ్యాక్ ఎప్పుడు ఇస్తుందో చూడాలి.