Medaram Jatara: రేపు సెలవు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ రాష్ట్ర పండుగ మేడారం జాతర వైభవంగా జరుగుతోంది. మేడారం జాతరకు భారీ ఎత్తున ప్రజలు తరలివెళ్తున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం సెలవు ప్రకటించింది. అయితే ఈ సెలవు రాష్ట్రం మొత్తానికి కాకుండా కేవలం వరంగల్, పెద్దపల్లి జిల్లాలకే వర్తించనుంది. ఈ మేరకు ఆయా జిల్లాల కలెక్టర్లకు ప్రభుత్వం సెలవు ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో వరంగల్, పెద్దపల్లి జిల్లాల కలెక్టర్లు సెలవులపై ప్రకటన చేశారు.
మేడారం జాతర సందర్భంగా వరంగల్, పెద్దపల్లి జిల్లాలలో శుక్రవారం సెలవు ఉంటుందని.. విద్యాసంస్థలతో పాటు స్థానిక సంస్థలకు సెలవు వర్తిస్తుందని ఆయా జిల్లాల కలెక్టర్లు ప్రకటన చేశారు. అయితే బ్యాంకులు మాత్రం తెరిచే ఉంటాయని వివరించారు. కాగా శుక్రవారం నాడు మేడారం జాతరకు తెలంగాణ సీఎం కేసీఆర్ వెళ్లనున్నారు. మేడారంలో కొలువుదీరిన సమ్మక్క-సారలమ్మలను కేసీఆర్ దర్శించుకోనున్నారు. కేసీఆర్ పర్యటన సందర్భంగా సీఎస్ సోమేష్ కుమార్, డీజీపీ మహేందర్‌రెడ్డి ఏర్పాట్లను పర్యవేక్షించారు.
Also Read
తాజావార్తలు
-
Hyderabad Rains : హైదరాబాద్‌ను ముంచెత్తిన కుండపోత.. ఈదురుగాలులతో హై అలర్ట్.!
-
Pakistan: పాక్‌లో ఇంధన మంటలు.. రూ.400కు చేరిన లీటర్ పెట్రోల్.. గాడిదలతో నాయకుల నిరసన
-
Nayanthara: హీరోయిన్గా హిట్టు.. ప్రొడ్యూసర్‌గా ఫట్టు! ప్రొడక్షన్ కంపెనీని మూసివేసే దిశగా స్టార్ హీరోయిన్?
-
Ajit Agarkar: మనసు మార్చుకున్న అజిత్ అగార్కర్.. తుది నిర్ణయం బీసీసీఐకి వెల్లడి…
-
Harish Rao: ఎల్‌నినో కాదు.. కాంగ్రెస్ చేతకానితనమే కరువుకు కారణం
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!