MLA’s Purchase Case : సీవీ ఆనంద్ స్వతంత్రంగా పనిచేస్తారు.. ఆయన ఎవరి ఒత్తిళ్లకు లొంగట్లేదు : సిట్ లాయర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మొయినాబాద్ ఫాంహౌస్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే కొనుగోలు కేసుపై హైకోర్టులో నేడు విచారణ జరిగింది. అయితే.. ఇప్పటికే రామచంద్ర భారతి, నంద కుమార్, సింహయాజులు దగ్గర నుంచి రాబట్టి వివరాలు, వారి సెల్‌ఫోన్ డాటా ఆధారంగా పలువురుకి ప్రత్యేక దర్యాప్తు బృందం నోటీసులు జారీ చేసింది. అయితే.. తాజాగా నేడు విచారణలో సిట్ తరపున లాయర్ దువే వాదనలు వినిపించారు. కుట్రలు బయటపడడంతోనే బీజేపీ ఆందోళన చెందుతోందని దువే హైకోర్టుకు వివరించారు. ప్రభుత్వం ప్రమాదంలో పడుతుంటే ఊరుకుంటారా? ఇలా కొనుగోళ్లు జరుగుతూపోతుంటే ప్రజాస్వామ్యం ఖూనీ కాదా.. తప్పు చెయ్యకపోతే సిట్ దర్యాప్తు ను ఎందుకు అడ్డుకోవాలనుకుంటున్నారని దువే అన్నారు. ప్రతిపక్ష నేతలను ఈడీ, ఐటీ చేత దాడులు చేయిస్తుందని దువే హైకోర్టుకు వివరించారు.
Also Read :Wedding: పెళ్లి మండపంలోనే ఆగలేకపోయిన వరుడు.. అందరూ చూస్తుండగానే..
Also Read
- Smit Machchhar: భారత పైలట్‌కు ఘన గౌరవం.. ఇజ్రాయెల్‌లో మారుమోగుతున్న మచ్చర్ పేరు!
- Election Commission: ఎన్నికల సంఘంలో విభేదాలపై సంచలనం.. ‘‘అన్ని నిర్ణయాలు ఏకగ్రీవమే’’..
- KTR : రేవంత్ ఒక నిజాయితీ గల మోసగాడు.. ప్రశ్నిస్తున్నామని ఆయనకు కోపం
- Flydubai Heroes: పైలట్, ప్లంబర్, డెంటిస్ట్, బిజినెస్ మ్యాన్, బ్యాంకర్.. ఫ్లైదుబాయ్ ఘటనలో హీరోలు వీరే..
అరెస్ట్ అయిన నిందితులకు బీజేపీ అధినేతలకు నేరుగా సంబంధాలు ఉన్నాయని దువే హైకోర్టుకు తెలిపారు. ఎమ్మెల్యేల కొనుగోలుపై పక్కా ఆధారాలు ఉన్నాయని దువే ఉద్ఘాటించారు. టీఆర్‌ఎస్ పార్టీ ప్రమాదంలో పడుతుందని తెలిసినప్పుడు… ఆ పార్టీ అధ్యక్షుడిగా, సీఎంగా ఆయన ప్రజల ముందుకు తీసుకెళ్లడం తప్పేలా అవుతుందన్నారు దువే. ప్రజల్లోకి ఈ కొనుగోలు వ్యవహారం తీసుకెళ్లడం సీఎం హక్కు అని దువే హైకోర్టుకు వివరించారు.
Also Read ; Mahesh Kumar Goud : తెలంగాణ రాక ముందు, ఇప్పుడు మీ ఆస్తులు ఎంతా?.. చర్చకు వస్తారా
సిట్ చీఫ్ సీవీ ఆనంద్ కు 5 ఏళ్ల సర్వీస్ ఉందని, ఢిల్లీ కేంద్రంగా ఐపీఎస్ అధికారి పనిచేస్తారన్నారు. దేశంలో ఎక్కడైనా పనిచెయ్యాల్సి ఉంటుందని, సీవీ ఆనంద్ స్వతంత్రంగా పనిచేస్తారు.. ఆయన ఎవరి ఒత్తిళ్లకు లొంగట్లేదని దువే న్యాయస్థానానికి వెల్లడించారు. అయితే.. ఈ కేసులో వాదనలు విన్న హైకోర్టు విచారణ మంగళవారానికి వాయిదా వేసింది.
Also Read : Nara Brahmani : వావ్.. నారా బ్రహ్మణిలో మరో టాలెంట్.. లడక్‌లో బైక్ రైడింగ్ వీడియో..
తాజావార్తలు
-
Krishna: ఇండస్ట్రీని రెండుగా చీల్చాలని చూస్తే ఊరుకోం.. జానీ మాస్టర్ భార్యపై ప్రొడక్షన్ ప్రెసిడెంట్ ఫైర్!
-
Naga Vamsi: డౌట్లు ఉంటే తీసేయండి.. నాగవంశీ మార్క్ స్టేట్మెంట్తో గురూజీ ఫ్యాన్స్ ఫుల్ ఖుష్!
-
Danam Nagender: ఖైరతాబాద్ ఓట్లపై దానం ఫైర్.. హైదరాబాద్ తగలబడిపోతుంది.!
-
Smit Machchhar: భారత పైలట్‌కు ఘన గౌరవం.. ఇజ్రాయెల్‌లో మారుమోగుతున్న మచ్చర్ పేరు!
-
Election Commission: ఎన్నికల సంఘంలో విభేదాలపై సంచలనం.. ‘‘అన్ని నిర్ణయాలు ఏకగ్రీవమే’’..
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?