తెలంగాణలో పోడు భూముల సమస్య ప్రభుత్వానికి తలనొప్పిగా మారింది.. గిరిజనులు పోడు చేసుకోవడం.. ఫారెస్ట్ అధికారులు అడ్డుకోవడం.. తోపులాటలు, ఘర్షణలు, దాడులు.. ఇలా.. చాలా సందర్భాల్లో సమస్యలు వస్తున్నాయి.. అయితే, పోడు భూముల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా అడుగులు వేస్తోంది తెలంగాణ ప్రభుత్వం.. రాష్ట్రంలో పోడు భూముల సమస్యకు శాశ్వత పరిష్కారం కై పోడు భూములకు సంబంధించి దరఖాస్తులను స్వీకరించాలన్న సీఎం కేసీఆర్ నిర్ణయం మేరకు.. ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు సీఎస్ సోమేష్ కుమార్..…