తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతూనే ఉంది.. నిన్న కాస్త పెరిగిన పాజిటివ్ కేసులు.. ఇవాళ భారీగానే తగ్గాయి.. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన కరోనా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 1,16,252 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 1,489 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.. కోవిడ్ బారినపడి మరో 11 మంది ప్రాణాలు వదిలారు.. ఇక, ఇదే సమయంలో.. 1,436 మంది కోవిడ్ బాధితులు పూర్తిస్థాయిలో కోలుకున్నారు.. దీంతో పాజిటివ్ కేసుల సంఖ్య 6,07,925 చేరుకోగా.. ఇప్పటి వరకు 5,84,429 మంది కోవిడ్ బాధితులు కోలుకున్నారు.. ఇక, మృతుల సంఖ్య 3,521కు పెరిగింది. ప్రస్తుతం.. రాష్ట్రవ్యాప్తంగా 19,975 యాక్టివ్ కేసులు ఉన్నట్టు బులెటిన్‌లో పేర్కొంది ప్రభుత్వం.. రివకరీ కేసుల సంఖ్య 96.13 శాతానికి పెరిగింది.. తాజా కేసుల్లో అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 175 కొత్త కేసులు వెలుగుచూశాయి.