తెలంగాణలో కరోనా కేసులు స్థిరంగా కొనసాగుతున్నాయి… రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం… గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా నమోదైన కేసులు కాస్త పెరిగాయి.. 1,08,921 శాంపిల్స్ పరీక్షించగా… 609 మందికి పాజిటివ్‌గా తేలింది… మరో నలుగురు కోవిడ్ బాధితులు మృతిచెందారు.. ఇదే సమయంలో 647 మంది కోవిడ్ నుంచి పూర్తిస్థాయిలో కోలుకున్నారు.. దీంతో.. మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 6,46,606కు చేరగా… కోలుకున్నవారి సంఖ్య 6,34,018కి పెరిగింది.. ఇక, ఇప్పటి వరకు కరోనాతో రాష్ట్రంలో 3,811 మంది మృత్యువాతపడ్డారు.. ప్రస్తుతం 8,777 యాక్టివ్ కేసులు ఉన్నట్టు బులెటిన్‌లో పేర్కొంది ప్రభుత్వం.
తెలంగాణలో కరోనా రికవరీ కేసుల సంఖ్య 98.05 శాతంగా ఉంటే.. భారత్‌లో 97.36 శాతంగా ఉందని కోవిడ్ బులెటిన్‌లో పేర్కొంది తెలంగాణ సర్కార్.. ఇక, తాజా కేసుల్లో జీహెచ్‌ఎంసీ పరిధిలో అత్యధికంగా 81 కేసులు నమోదు కాగా.. కరీంనగర్‌లో 67, ఖమ్మంలో 51, నల్గొండలో 48, వరంగల్ అర్బన్‌లో 41, పెద్దపల్లిలో 39, రంగారెడ్డిలో 36, మేడ్చల్‌లో 36 కేసులు.. ఇలా అత్యధికంగా కొత్త కేసులు వెలుగుచూశాయి. అయితే, హైదరాబాద్‌లో కంటే.. కరీంనగర్‌లోనే నిన్న అత్యధిక కేసులు నమోదు అయ్యాయి.. దీంతో.. అప్రమత్తమైన అధికారులు.. తప్పనిసరిగా మాస్క్ ధరించడం, భౌతిక దూరం పాటించడం చేయాలని స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.