Digvijay Singh: టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మార్పుపై కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. టీపీసీసీ చీఫ్ మార్పు, ఇన్‌ఛార్జ్‌ల మార్పు తన పరిధిలోకి రాదన్నారు. టీకాంగ్రెస్‌పై త్వరలోనే స్పష్టత వస్తుందని దిగ్విజయ్ ఆశాభావం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ నేతలంతా ప్రజల్లోకి వెళ్లి పార్టీ పంథాకు కట్టుబడి ఉండాలని రాష్ట్ర నేతలకు సూచించారు. తెలంగాణ కాంగ్రెస్‌లో చాలా మంది సీనియర్ నేతలు ఉన్నారని, అందరూ కలిసి పని చేయాలని దిగ్విజయ్ సింగ్ సూచించారు.
Read also: Venkaiah Naidu: మనిషికి శ్వాస ఎంతో భాష కూడా అంతే అవసరం..
‘సమిష్టిగా పని చేస్తేనే ప్రత్యర్థులను ఓడించగలం. పార్టీ నేతలందరికీ ముకుళిత హస్తాలతో చెబుదాం. ఏవైనా సమస్యలుంటే అంతర్గతంగా చర్చించుకోవాలి. పార్టీలో విభేదాల గురించి ఏ నాయకుడూ బహిరంగంగా మాట్లాడకూడదు. బీఆర్‌ఎస్‌పై పోరాటానికి కాంగ్రెస్ నేతలంతా సిద్ధంగా ఉండాలి. కేసీఆర్ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత ఉంది. పార్టీ సీరియస్‌తో కాకుండా పనితీరుతో ముందుకు సాగుతుందని దిగ్విజయ్ సింగ్ అన్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి 34 ఏళ్లు, నేను 38 ఏళ్లు పీసీసీ చీఫ్‌లుగా పనిచేశాను.సీఎంలతో కలిసి పనిచేసి విజయం సాధించాం. టీ కాంగ్రెస్‌లో సీనియర్లు, జూనియర్ల ప్రస్తావన లేదు. అందరూ కలిసి పనిచేస్తేనే మంచి ఫలితం వస్తుందన్నారు. ప్రభుత్వంపై పోరాటానికి సిద్ధంకండి’’ అని దిగ్విజయ్ సింగ్ అన్నారు.
Read also: Cirkus: బాలీవుడ్ ఖాతాలో మరో భారి ఫ్లాప్?
అందరూ పార్టీ నిబంధనల మేరకే పని చేయాలని తెలిపారు. సమస్యలు ఉంటే పార్టీలో అంతర్గతంగా మాట్లాడండి.. బహిరంగ ఆరోపణలు వద్దన్నారు. తెలంగాణ కాంగ్రెస్ నేతలకు చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తున్న మరో మారు ఇలాంటివి పునరావృతం కావొద్దని, అలా జరిగితే ఎంత పెద్ద నాయకుడి పైన చర్యలు తీసుకుంటామని దిగ్విజయ్ సింగ్ అన్నారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ బీజేపీతో ప్రజలు విసిగిపోయారని తెలిపారు. అన్ని సెటిల్ అవుతాయని, కాంగ్రెస్ నేతలంతా ఐక్యంగా ఉంటేనే బీఆర్ఎస్.. బీజేపీని ఎదుర్కోగలమన్నారు. రేవంత్ నన్ను మొన్ననే కలిశారని, అన్ని సెటిల్ అవుతాయని,
నో ప్రాబ్లమ్ అన్నారు దిగ్విజయ్ సింగ్. సీనియారిటీ కాదు పనితీరు తోటే పార్టీ ముందుకు పోతుందని గుర్తుచేశారు.
Cirkus: బాలీవుడ్ ఖాతాలో మరో భారి ఫ్లాప్?
