కొన్ని దశాబ్దాల పాటు ఫేస్ ఆఫ్ ఇండియన్ సినిమాగా ఉన్న ఇండస్ట్రీ ‘బాలీవుడ్’. వెస్ట్ ఆడియన్స్ కి ఇండియన్ సినిమా అనే మాట వినగానే ‘హిందీ ఫిల్మ్ ఇండస్ట్రీ’ గుర్తొస్తుంది. అంతటి ఇంపాక్ట్ క్రియేట్ చేసి షారుఖ్, ఆమిర్, సల్మాన్, అజయ్ దేవగన్, అక్షయ్ కుమార్, రణబీర్ కపూర్, రణవీర్ సింగ్ లాంటి స్టార్ హీరోస్ ని ఇచ్చిన ఇండస్ట్రీ ఇప్పుడు కష్టాల్లో ఉంది. నార్త్ ఆడియన్స్ హిందీ సినిమాలని చూడడానికి థియేటర్స్ కి రావట్లేదు. బాయ్కాట్ ట్రెండ్, అర్బన్ కథలు, రీమేక్ సినిమాలు, నెపోటిజం లాంటి ఇష్యూస్ హిందీ చిత్ర పరిశ్రమని కోలుకోలేని దెబ్బ తీస్తున్నాయి. ఈ బాలీవుడ్ డౌన్ ట్రెండ్ కి ‘భూల్ భులయ్య 2’, ‘బ్రహ్మాస్త్ర’, ‘దృశ్యం 2’ లాంటి సినిమాలు కాస్త ఊపిరి పోశాయి కానీ బాలీవుడ్ లో ఒక్క సినిమా హిట్ అయితే పది సినిమాలు ఫ్లాప్ అవుతున్న పరిస్థితి ఉంది. ఇలాంటి పరిస్థితిలో 2022 ఇయర్ కి మంచి ఎండింగ్ ఇస్తారేమో అనే హోప్ కలిగించిన సినిమా ‘సర్కస్’.
కమర్షియల్ సినిమాలకి కేరాఫ్ అడ్రెస్ గా ఉండే ‘రోహిత్ శెట్టి’, హై వోల్టేజ్ కరెంట్ వైర్ లా ఉండే ‘రణవీర్ సింగ్’ కలిసి చేసిన ఈ సినిమా క్రిస్మస్ కానుకగా ఆడియన్స్ ముందుకి వచ్చింది. ట్రైలర్ తో పర్వాలేదు అనిపించిన ఈ కామెడీ ఎంటర్టైనర్ సినిమాని ‘అవుట్ డేటెడ్’ అంటూ ఫిల్మ్ క్రిటిక్ ‘తరన్ ఆదర్శ్’ ట్వీట్ చేశాడు. రోహిత్ శెట్టి సినిమాల్లో ఉండే ఎంటర్టైన్మెంట్ సర్కస్ సినిమాలో మిస్ అయ్యింది, సెకండ్ హాఫ్ లో కొన్ని సీన్స్ బాగానే ఉన్నా ఆశించిన స్థాయిలో ఈ సినిమా లేదంటూ తన రివ్యూ ఇచ్చాడు. దీంతో బాలీవుడ్ కష్టాల ఖాతాలో మరో సినిమా చేరిందంటూ సోషల్ మీడియాలో ట్వీట్స్ చేస్తున్నారు. మరి ఈ బాలీవుడ్ డౌన్ ట్రెండ్ కి కింగ్ ఖాన్ షారుఖ్ అయినా ‘పఠాన్’ సినిమాతో ఎండ్ కార్డ్ వేస్తాడేమో చూడాలి.
#OneWordReview…#Cirkus: OUTDATED.
Rating: ⭐️⭐️
Lacks entertainment and humour you associate with a #RohitShetty film… Has some funny moments [second half], but the spark is missing. #CirkusReview pic.twitter.com/vDoKULUllZ— taran adarsh (@taran_adarsh) December 23, 2022