60 ఏళ్ల సినీ జీవితంలో ఎన్నో మరపురాని పాత్రలతో తెలుగు ప్రేక్షకులను అలరించిన సీనియర నటులు కైకాల సత్యానారాయణ కన్నమూశారు.

కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. ఈ రోజు తెల్లవారుజామున ఆస్పత్రిలోనే తుదిశ్వాస విడిచారు. 

1959లో సినీరంగ ప్రవేశం చేసిన నటుడు సత్యానారాయణ.. 

విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా, కామెడీ విలన్‌గా తనకే సాధ్యమైన వైవిధ్యమైన నటనతో తెలుగువారి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు.

1935లో కృష్ణా జిల్లా, గుడ్ల వల్లేరు మండలం, కౌతవరంలో జన్మించిన ఆయన గుడివాడ, విజయవాడలో విద్యాభ్యాసం పూర్తిచేశారు. 

1960లో నాగేశ్వరమ్మతో వివాహం కాగా.. ఇద్దరు కూతుళ్లు, కుమారులు ఉన్నారు.

కైకాల చేపలంటే ఇష్టంగా తింటారు. 

ఆరు దశాబ్దాల సినీ కెరీర్‌లో ఆయన పోషించని పాత్ర లేదంటే అతిశయోక్తి కాదు. 

పౌరాణిక, సాంఘిక, చారిత్రక, జానపద పాత్రలను అవలీలగా చేయడంలో ఆయనకు ఆయనే సాటి. 

హైదరాబాద్‌లోని మహా ప్రస్థానంలో కైకాల సత్యనారాయణ అంత్యక్రియలు