శ్రీకాకుళం జిల్లా ఇప్పిలి గ్రామంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న రెవిన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రం డబ్బంతా హైదరాబాద్ లో పెట్టాం ..వాళ్ళు వెళ్ళిపొమ్మన్నారు.. రేపు రాష్ట్ర సంపదంతా అమరావతిలో పెడితే వారు వెళ్ళిపొమ్మంటే ఏం చేస్తాం? అన్ని రకాలుగా అభివృద్ది చెందిన విశాఖని రాజధానిగా వద్దంటున్నారు చంద్రబాబు. రియల్ ఎస్టేట్ కోసం చంద్రబాబు అమరావతిని సృష్టించారు. విశాఖ రాజధాని వద్దంటూ యాత్ర మోదలు పెట్టారు. ప్రజల తిరుగుబాటు చూసి తోక ముడిచి వెల్లిపోయారు.
యాత్ర గురించి మాట్లాడటమే మానేసి .. అక్కడ ఇక్కడ అన్యాయం అయిపోయిందంటున్నారు. అన్యాయాలకి అడ్రస్ టీడీపీ, చంద్రబాబు లే ..నువ్వు అన్యాయాలగురించి చెప్పడమేంటి? చంద్రబాబు హైదరాబాద్ లో ఉండి ఆంధ్రప్రదేశ్ గురించి సలహాలు ఇస్తారు? ముందు ఆంధ్రప్రదేశ్ లో సెటిలై అప్పుడు మాట్లాడు చంద్రబాబూ . అందరిని కూడగట్టి ..అధికారంలోకి రావాలనుకుంటున్నావ్ .. అది సాధ్యం కాదు. టీడీపీ ఐదేళ్లలో ఒక్క పథకమైనా న్యాయం గా ఇచ్చారా అని మంత్రి ధర్మాన ప్రశ్నించారు. పథకాలపై ఆరోపణలు చేస్తావ్ ..మరలా మేం అధికారంలోకి వస్తే అన్ని కొనసాగిస్తానంటావ్ … ఇదేం మాయ మాటలు బాబూ అని ఎద్దేవా చేశారు.
Read Also: Srikanth: విడాకుల పుకార్లను ఖండించిన శ్రీకాంత్.. ఆ వెబ్‌సైట్స్‌పై చర్య
రోడ్లకి కన్నాలు పడితే కారణం మీరేకదా ..మీ ఐదేళ్లలోమంచి రోడ్లు వేస్తే .. ఈ పరిస్థితి ఉండేది కాదుగా అన్నారు. చంద్రబాబు మళ్లీ వస్తే అన్ని పథకాలు తీసేస్తాడు ..రాష్ట్రంలో నివాసం లేని నీకు రాష్ట్రంతో సంబంధం ఏంటి చంద్రబాబూ అని మండిపడ్డారు మంత్రి ధర్మాన.
Read Also:NC22: చైతన్యను తాకాలంటే ఏ శక్తి సరిపోదు