కేసీఆర్ పాలనలో ప్రమాదంలో ఉంది. రాష్ట్రం మాదకద్రవ్యాల మయం అయ్యింది. వైట్ ఛాలెంజ్ కు స్పందించని కేటీఆర్ ఎందుకు స్పందించలేదు అని పీసీసీ అధికార ప్రతినిధి మానవతా రాయ్ అన్నారు. రేవంత్ రెడ్డి వైట్ ఛాలెంజ్ కు కేటీఆర్ పారిపోయాడు. పరువునష్టం దావా తో కేటీఆర్ పరువు పోయింది అని తెలిపారు. గతంలో జరిగిన డ్రగ్స్ కేసుల విచారణను నీరుగార్చే ప్రయత్నం జరిగింది. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఎందుకు విచారణ సరిగ్గా జరగదు. డ్రగ్స్ కేసులో కొదరు సినీ తారలను రక్షించే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తుంది అని తెలిపారు. మాదక ద్రవ్యాలు అమ్ముకునే చరిత్ర ఆర్మూర్ జీవన్ రెడ్డి ది స్వయం కృషితో రేవంత్ రెడ్డి ఈ స్థాయికి వచ్చాడు. కానీ తండ్రి సహకారంతో మంత్రి అయ్యాడు కేటీఆర్ అన్నారు. అడ్డదారిలో ఎమ్మెల్యే అయ్యిన చరిత్ర కేటీఆర్ ది. కేసీఆర్ పై సహారా కేసు ఉన్న మాట వాస్తవం కాదా అని అడిగారు. 2014 కు ముందు కేటీఆర్ ఆస్తులు ఎంత .. ఇప్పుడు మీ ఆస్తులు ఎంత. కేటీఆర్ ఆస్తులు ఇంతగా ఎలా పెరిగాయి చెప్పాలి. సామాన్య కుటుంబం నుంచి వచ్చిన కేటీఆర్ బావమరిది ఇప్పుడు 13 కంపెనీలకు ఎలా డైరెక్టర్ అయ్యాడు అని ప్రశ్నించారు.