Maheshwar Reddy: ఎంత గొప్ప నేత అయినా.. మాజీ అవ్వాల్సిందే..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తాజాగా కేంద్ర అధినాయకత్వం ప్రకటించిన కమిటీలు.. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో మరోసారి చిచ్చురేపాయి.. తమకు అన్యాయం జరిగిందంటూ.. సీనియర్లు సైతం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.. పీసీసీ-సీఎల్పీ మధ్య అసలు సమన్వయమే లేదు అనేది వారిమాటల్లోనే స్పష్టం అవుతోంది.. ఇదే, సమయంలో పార్టీలో కోవర్టుల వ్యవహారం కూడా తెరపైకి వచ్చింది.. వీటిపై సీరియస్‌గా స్పందించారు కాంగ్రెస్ నేత మహేశ్వర్ రెడ్డి.. పార్టీలో కోవర్టులు ఉన్నారని చెప్పిన వాళ్లే ఎవరన్నది చెప్పాలని డిమాండ్ చేశారు.. ప్రతీసారి ఈ చర్చ ఎందుకు వస్తోంది? అని ప్రశ్నించిన ఆయన.. కోవర్టులు ఎవరన్న దానిపై పార్టీలో చర్చ జరగాలన్నారు.. పార్టీ పగ్గాలు తీసుకున్న నాయకుడు అందరిని కలుపుకుని నిర్ణయాలు తీసుకుంటే కోవర్టులు అనే చర్చ రాదని.. భేదాభిప్రాయాలు వచ్చినప్పుడే ఇలాంటి చర్చలు వస్తాయన్నారు.
Read Also: Etela Rajender: కరీంనగర్ గడ్డ తెలంగాణకు దిక్సూచి.. బీఆర్‌ఎస్ భరతం పడతాం..
Also Read
- Haribabu Murder Case: యూట్యూబర్ వైష్ణవి భర్త హత్య కేసులో కీలక పరిణామం.. మరో నలుగురి పాత్రపై దర్యాప్తు..!
- Hyderabad: హైదరాబాద్‌లో దారుణం.. హిట్ అండ్ రన్లో మూడేళ్ల బాలుడు మృతి
- Heavy Rain Alert: వినాయక నిమజ్జనం వేళ తెలంగాణకు చల్లని కబురు.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..
- Etela Rajender : తెలంగాణకు బీసీ సీఎం.. ఈటల కీలక వ్యాఖ్యలు
ఇక, పార్టీలో అందరూ కోరుకునేది ఆత్మభిమానమే అన్నారు మహేశ్వర్‌రెడ్డి.. ఎవరూ పీసీసీని తీసేయండి అని అనడం లేదు.. కోవర్టులు అనే నిందలు వేయడం కంటే.. ప్రత్యర్థులపై ఎందుకు కొట్లాడటం లేదు ? అని ప్రశ్నించారు. అందరం కలిసి పని చేసి.. అధికారంలోకి రావాలనే అజెండా ఉండాలన్న ఆయన.. పదవులు శాశ్వతం కాదు.. ఎంత గొప్ప నాయకుడు అయినా మాజీ అవ్వాల్సిందేనని వ్యాఖ్యానించారు. ఆత్మభిమానం చంపుకుని ఎవరు పని చేయరు.. కోవర్టులు ఉంటే బయటకు పంపాలి.. ఆధారాలు ఉంటేనే అంటారు కదా.. దామోదర రాజనర్సింహ ఆధారాలు లేకుండా అనరు కదా ? అని ఎదురు ప్రశ్నించారు. మరోవైపు, బలాబలాలు ప్రదర్శించుకోవడానికి అధికారంలో లేమని హితవుపలికిన ఆయన.. బలప్రదర్శన ఎన్నికల్లో చూపించుకోవాలి.. కమిటీలో చూపించుకుంటే ఏం లాభం? అని ఎద్దేవా చేశారు.. అసలు, భట్టి నాకు సమాచారం ఇవ్వలేదు అని చెప్పే పరిస్థితి ఎందుకు వచ్చింది? అని నిలదీసిన ఆయన.. భట్టి ఢిల్లీకి వెళ్ళింది ఖర్గేని సన్మానం చేయడానికే వెళ్లారు.. కమిటీల చర్చ జరగలేదు అని చెప్పుకొచ్చారు.. ఒంటెద్దు పోకడలు పార్టీకి నష్టం.. మెట్టు దిగి అందరిని కలుపుకుని పోవాలి.. ఎన్నికలకు సిద్ధం అవ్వాలి.. పీసీసీ మెట్టు దిగి వచ్చి కలుపుకుని పోవాల్సిన బాధ్యత పీసీసీదే అని స్పస్టం చేశారు మహేశ్వర్‌రెడ్డి.
తాజావార్తలు
-
AMB, AAAల తర్వాత ఇక ‘మెగా సినిమాస్’.. ప్రపంచ స్థాయి స్క్రీన్‌తో బాస్ ఎంట్రీ?
-
Ukraine War: రష్యాపై ఉక్రెయిన్ అతిపెద్ద దాడి.. 1000కి పైగా డ్రోన్లతో కల్లోలం..
-
Amazon Sale: ‘గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2026’ సేల్.. తేదీ ప్రకటించిన అమెజాన్..
-
EPS: సుప్రీంకోర్టు తీర్పు ఉన్నా వీడని ఈపీఎస్ కష్టాలు.. తెరపైకి కొత్త చిక్కులు..
-
Chiru Leaks: ‘కాకా’లో అసలు క్యారెక్టర్ పేరు చెప్పేసిన మెగాస్టార్.. ఫ్యాన్స్‌కి పూనకాలే!
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!