Bandla Ganesh: ‘ఇగో, మధ్యవర్తుల వల్లే ఆ కేసు’.. సమసిపోయిన బండ్ల గణేష్ చెక్ బౌన్స్ వివాదం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ నిర్మాత, నటుడు బండ్ల గణేష్‌కు సంబంధించిన చెక్ బౌన్స్ కేసు వ్యవహారం ఎట్టకేలకు సుఖాంతమైంది. గత కొన్ని రోజులుగా సినీ, రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారిన ఈ వివాదానికి తెరపడింది. ఈ మేరకు బండ్ల గణేష్‌పై కోర్టులో కేసు వేసిన ఫిర్యాదుదారుడు జెట్టి వెంకటేశ్వరరావు స్వయంగా రంగంలోకి దిగి, తమ మధ్య నెలకొన్న విభేదాలన్నీ పూర్తిగా సమసిపోయాయని స్పష్టం చేశారు. ఆయన ఒక ప్రత్యేక వీడియో సందేశాన్ని విడుదల చేశారు. ఈ వీడియోలో జెట్టి వెంకటేశ్వరరావు పలు ఆసక్తికర, సంచలన విషయాలను పంచుకున్నారు. ప్రకాశం జిల్లా ముప్పాల గ్రామానికి చెందిన తమకు, బండ్ల గణేష్‌కు మధ్య గత 15 ఏళ్లుగా ఎంతో మంచి సాన్నిహిత్యం ఉందని ఆయన గుర్తు చేసుకున్నారు. చిన్న స్థాయి నుంచి ఎంతో కష్టపడి బండ్ల గణేష్ ఈ స్థాయికి ఎదిగారని ప్రశంసించారు. అయితే, గతంలో తమ కుమారుడు, బండ్ల గణేష్ అందరూ ఎంతో స్నేహంగా ఉండేవారని, కానీ తన కుమారుడు మరణించిన తర్వాత పరిస్థితులు మారాయని తెలిపారు. ఆ సమయంలో తలెత్తిన వ్యక్తిగత ‘ఇగో’ కారణంగానో, లేదా మధ్యవర్తుల ప్రమేయం వల్లనో తమ ఇద్దరి మధ్య చిన్నపాటి మనస్పర్థలు వచ్చి, అవి కాస్తా కోర్టు కేసుల వరకు దారితీశాయని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.
నవంబర్ 18న ఈ కేసుకు సంబంధించి కోర్టు తీర్పు వెలువడిన తర్వాత, తాము వద్దని చెబుతున్నా వినకుండా కొందరు మీడియా ప్రతినిధులు ఇంటర్వ్యూల పేరుతో అనవసరపు హడావుడి చేశారని వెంకటేశ్వరరావు అసహనం వ్యక్తం చేశారు. ప్రస్తుతం తమ ఇద్దరి మధ్య ఎలాంటి ఆర్థిక పరమైన లేదా వ్యక్తిగత సమస్యలు లేవని, అన్ని విషయాలను సామరస్యంగా పరిష్కరించుకున్నామని ఆయన తేల్చి చెప్పారు. గతంలో ఉన్నట్లే ఇకపై కూడా బండ్ల గణేష్‌తో తన స్నేహం, అనుబంధం కొనసాగుతాయని జెట్టి వెంకటేశ్వరరావు ప్రకటించడంతో ఈ వివాదానికి పూర్తిస్థాయిలో ముగింపు పలికినట్లయింది.
Also Read
తాజావార్తలు
-
Bandla Ganesh: ‘ఇగో, మధ్యవర్తుల వల్లే ఆ కేసు’.. సమసిపోయిన బండ్ల గణేష్ చెక్ బౌన్స్ వివాదం
-
Jagapathi Babu: హద్దులు చెరిగిపోతున్నాయి.. ఇదే బెస్ట్
-
Vetrimaaran: 23 ఏళ్ల క్రితం రాసిన కథతోనే ఇన్ని హిట్లు కొట్టాడా? వెట్రిమారన్ షాకింగ్ స్టేట్మెంట్!
-
Dare Devil: అజిత్ సినిమాలో సీఎం క్యామియో?
-
Russia Nuclear Satellite: అంతరిక్షంలో రష్యా అణుబాంబు.. న్యూక్లియర్ శాటిలైట్‌పై ఆందోళన.!
ట్రెండింగ్
-
6.58mm స్లిమ్ డిజైన్, 50MP కెమెరా, 6500mAh బ్యాటరీతో Huawei Mate 90 Air లాంచ్..!
-
2TB స్టోరేజ్, 8000 నిట్స్ బ్రైట్నెస్, 6200mAh బ్యాటరీతో Huawei Mate X8 లాంచ్..!
-
టీ20ల్లో చరిత్ర సృష్టించిన Priyansh Arya.. 68 బంతుల్లో 181 పరుగులు..! క్రిస్ గేల్ రికార్డ్ బద్దలు..
-
రూ.83 వేల ప్రారంభ ధరతో ఐదు వేరియంట్లతో లాంచ్.. Suzuki Access 125 స్కూటర్లో కొత్త కలర్స్..!
-
501.7cc ఇంజిన్, మూడు వేరియంట్లు.. రెట్రో లుక్‌తో Honda CB500 బైక్..!