తెలంగాణ పీసీసీ కార్యరంగంలోకి దిగబోతోంది. కొత్త టీమ్‌తో పార్టీ రాష్ట్ర ఇంఛార్జ్ మాణికం ఠాగూర్ ఇవాళ సమావేశం కానున్నారు. రోజంతా పార్టీ ముఖ్య నాయకులతో భేటీలు నిర్వహించనున్నారు. భవిష్యత్ కార్యాచరణ కూడా ప్రకటించే అవకాశం ఉంది. ఇన్నాళ్లు తెలంగాణ స్తబ్దుగా ఉన్న కాంగ్రెస్ పార్టీలో కొంత జోష్ వచ్చినట్టు కనిపిస్తోంది. ఇన్నాళ్లూ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన పీసీసీ కొత్త టీమ్ ఎంపిక పూర్తయిపోవడంతో… కార్యాచరణ మొదలెట్టింది. ఇప్పటికే పార్టీ చాలా నష్టం జరిగిందనీ… ఇకపై యాక్షన్‌లోకి దిగాలని హస్తం పార్టీ భావిస్తోంది.
also read : ఇండియాలో పెరుగుతున్న కరోనా కేసులు.. 24 గంటల్లో
అయితే కొత్త చీఫ్ పై పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. తాను అనుకున్నట్టుగానే పని చేసుకుంటారని… అందరి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోరనీ.. అభిప్రాయం వ్యక్తమవుతోంది. అందుకే, ఇవాళ జరిగే మొదటి సమావేశం లో పలు అంశాలపై చర్చ జరగనుంది. ఉదయం 10 గంటలకు పిసిసి, clp.. వర్కింగ్ ప్రెసిడెంట్, కమిటీ చైర్మన్ లతో ఇంచార్జ్ ఠాగూర్ సమావేశం కానున్నారు.
ఈ సమావేశంలో ప్రధానంగా… వచ్చే రెండు నెలల పాటు కార్యాచరణకు ప్లాన్ సిద్ధం చేయడంపై చర్చించనున్నారు. ఏఐసీసీ ఇచ్చిన కార్యక్రమాల అమలుపై చర్చ జరగనుంది. నిరుద్యోగ సమస్యని హైలెట్ చేయాలని చూస్తోంది కాంగ్రెస్. దీనిపైనా సమావేశంలో చర్చ జరగనుంది. అవసరమైతే పిసిసి చీఫ్ రేవంత్… ఈ అంశంపైనే పాదయాత్ర చేసే ఆలోచన లో ఉన్నారు.