తెలంగాణ పీసీసీ కార్యరంగంలోకి దిగబోతోంది. కొత్త టీమ్‌తో పార్టీ రాష్ట్ర ఇంఛార్జ్ మాణికం ఠాగూర్ ఇవాళ సమావేశం కానున్నారు. రోజంతా పార్టీ ముఖ్య నాయకులతో భేటీలు నిర్వహించనున్నారు. భవిష్యత్ కార్యాచరణ కూడా ప్రకటించే అవకాశం ఉంది. ఇన్నాళ్లు తెలంగాణ స్తబ్దుగా ఉన్న కాంగ్రెస్ పార్టీలో కొంత జోష్ వచ్చినట్టు కనిపిస్తోంది. ఇన్నాళ్లూ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన పీసీసీ కొత్త టీమ్ ఎంపిక పూర్తయిపోవడంతో… కార్యాచరణ మొదలెట్టింది. ఇప్పటికే పార్టీ చాలా నష్టం జరిగిందనీ… ఇకపై యాక్షన్‌లోకి దిగాలని…