Hyderabad: హైదరాబాద్ నగరంలో జింకలు, దుప్పి మాంసం విక్రయిస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి మాంసాన్ని స్వాధీనం చేసుకున్నారు. శబ్దం కాకుండా మాంసం విక్రయిస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. వివరాల్లోకి వెళితే..శంషాబాద్ ఎయిర్ పోర్టు పోలీస్ స్టేషన్ పరిధిలోని గగన్ పహాడ్ లో ఎస్ ఓటీ పోలీసులు తనిఖీలు చేపట్టారు. కొందరు దుండగులు జింకలు, దుప్పుల మాంసాన్ని అక్రమంగా విక్రయిస్తున్నారనే సమాచారంతో సీఐ సత్యనారాయణగౌడ్ ఆధ్వర్యంలో తెల్లవారుజామున దాడులు నిర్వహించారు.
Read also: Rowdy Sheeter: బోరబండలో రౌడీ షీటర్ దారుణ హత్య..!
జింక, దుప్పుల మాంసాన్ని విక్రయిస్తున్న పోలీసులు రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం సరస్వతీపురం గ్రామానికి చెందిన వెంకటేష్, కందుకూరు మండలం లేమూరు గ్రామానికి చెందిన కరుణాకర్, నల్గొండ జిల్లా మర్రిగూడ మండలం యరగండ్లపల్లి గ్రామానికి చెందిన శ్రీనులను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 16 కిలోల జింక, దుప్పుల మాంసాన్ని స్వాధీనం చేసుకున్నారు. రెండు ద్విచక్రవాహనాలను స్వాధీనం చేసుకుని ఆర్‌జీఐఏ పోలీసులకు అప్పగించారు. అటవీ ప్రాంతాల్లో వన్యప్రాణులను వేటాడి మాంసాన్ని నగర శివారులో విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ మేరకు ఆర్జీఐఏ పోలీసులు ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. విచారణ అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని చెప్పారు.
Read also: Telangana Rains: వాతావరణశాఖ కీలక అప్టేట్.. నేటి నుంచి వచ్చే మూడ్రోజులు వర్షాలే
నిర్మల్ జిల్లాలో జనవరి 2023లో కుక్కను చంపి జింక మాంసంగా విక్రయించడం ఆ ప్రాంతంలో కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. లక్ష్మణచాంద గ్రామంలో పెంపుడు కుక్కను దొంగిలించి దుండగులు జింక మాంసంగా అమ్మారు. కుక్కల దొంగతనానికి సంబంధించిన వీడియో సీసీటీవీలో రికార్డయింది. పోలీసులు విచారించగా అసలు నిజం బయటపడింది. కుక్కను దొంగిలించిన శ్రీనివాస్, వరుణ్‌లను పోలీసులు విచారించారు. జింక మాంసం పేరుతో కుక్క మాంసాన్ని విక్రయిస్తున్నట్లు నిందితులు అంగీకరించారు. దీంతో కుక్క మాంసం కొనుగోలు చేసిన వారు భయాందోళనకు గురవుతున్నారు. నిందితుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
Independence Day Celebrations: ఈ సారి పంద్రాగస్టుకు సామాన్యులే చీప్ గెస్టులు.. 1800 మందిని ఆహ్వానించిన కేంద్రం