CM KCR: ఇవాళ తెలంగాణ సీఎం కేసీఆర్ ఢిల్లీ బయలుదేరనున్నారు. ఎల్లుండి (ఈ నెల 14న) బీఆర్ఎస్ ఆఫీసు ప్రారంభిస్తామని చెప్పిన నేపథ్యంలో ఆయన ఇవాళ రాజధానికి పయనం కానున్నారు. ఢిల్లీలో డిసెంబర్ 14న ఎస్పీ రోడ్ లో బీఆర్ఎస్ తాత్కాలిక కార్యాలయాన్ని ప్రారభించనున్నారు సీఎం. బీఆర్ఎస్ జాతీయ విధానాన్ని, జాతీయ కార్యవర్గాన్ని అదే రోజు ప్రకటించనున్నారు. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో ముందుగానే మంత్రి నిరంజన్ రెడ్డి, ఎంపీ సంతోష్ కుమార్ లు కార్యాలయం ప్రారంభ పనులను చూసుకోవడానికి ఢిల్లీ వెళ్లారు. అయితే ఈ కార్యక్రమానికి మంత్రులంతా..ఆయా జిల్లాల ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నేతలను తీసుకొని రావాలని కేసీఆర్ ఆదేశించారు. శాశ్వత భవనం నిర్మాణంలో ఉన్నందున.. ప్రస్తుతానికి ఒక భవనాన్ని పార్టీ కార్యకలాపాల నిమిత్తం అద్దె ప్రాతిపదికన తీసుకున్నారు. దాన్నే సీఎం కేసీఆర్ 14న ప్రారంభించనున్నారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. బీఆర్ఎస్ కార్యాలయంలో ఇప్పటికే పెయింటింగ్, రిపేర్ వర్క్స్ పూర్తయ్యాయి. కార్యాలయానికి చేయాల్సిన మార్పులపై సిబ్బందికి ఇదివరకే పలు సూచనలు చేశారు కేసీఆర్. మూడు రోజుల్లో పనులన్నీ పూర్తి చేయాలని కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. సర్ధార్ పటేల్ రోడ్ లో భారీ భవనాన్ని బీఆర్ఎస్ కోసం ఏడాది పాటు అద్దెకు తీసుకున్నారు.
Read also: Konda Surekha Resign.. What Next: కొండా సురేఖ రాజీనామా.. నెక్స్ట్ ఏంటి?
ఇవాల సాయంత్రం 5 గంటలకు ప్రత్యేక విమానంలో ఢిల్లీ వెళ్ళనున్నారు. రాత్రికి ఢిల్లీ చేరుకోనున్న ముఖ్యమంత్రి కేసీఆర్ అక్కడ జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలించనున్నారు. జాతీయ పార్టీల నేతలతో ఆయన భేటీ కానున్నారు. రాజకీయ నేతలు, సామాజికవేత్తలు, ఆర్థికవేత్తలతో పాటు పలువురు ప్రముఖులతోనూ ఆయన భేటీ కానున్నట్లు సమాచారం. పార్టీ సంబంధిత కార్యక్రమాల నిమిత్తం ఆయన 17వ తేదీ వరకు ఢిల్లీలోనే ఉంటారు.తెలంగాణ ఉద్యమం నుంచి పుట్టిన తెలంగాణ రాష్ట్ర సమితి.. ఇక నుంచి భారతీయ రాష్ట్ర సమితిగా జాతీయ పార్టీగా అవతరించింది. పార్టీ పేరు మార్పు విషయమై టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్కు ఈసీ లేఖ రాసింది. ఈ సందర్భంగా లేఖపై కేసీఆర్ సంతకం చేశారు. ఈ కార్యక్రమానికి కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి, నటుడు, రాజకీయ నాయకుడు ప్రకాష్ రాజ్ హాజరయ్యారు. గులాబీ జెండా మధ్యలో భారతదేశం చిత్రీకరించబడింది. పార్టీ జెండా రంగు, గుర్తు మారలేదు. 22 ఏళ్ల టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా ప్రజల్లోకి తీసుకెళ్లే అంశంపై ఆయన పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. తెలంగాణకు చెందిన శాసన సభల ప్రతినిధులు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, స్థానిక సంస్థల ప్రతినిధులు కూడా పెద్ద సంఖ్యలో ఢిల్లీ వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. ఢిల్లీలో ప్రధాన కార్యాలయాన్ని ప్రారంభించిన తర్వాత దేశంలోని పలు రాష్ట్రాల్లో కార్యాలయాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది. పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవం సందర్భంగా ఢిల్లీ వీధుల్లో పెద్ద ఎత్తున హోర్డింగ్లు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. కేసీఆర్ ఫర్ ఇండియా, దేశ్ కా నేత, కిసాన్ కీ భరోసా, అబ్ కీ బార్ కిసాన్ సర్కార్ నినాదాలతో హోర్డింగ్ లు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.
Monday Bhakthi Tv Matrabalam Live: జీవితంలో ఒక్కసారైనా ఈ విభూదిని ధరిస్తే చాలు