కేంద్రంపై మరో పోరాటం.. నేడు కేసీఆర్ వ్యూహ రచన..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కేంద్రంపై మరోసారి పోరాటానికి సిద్ధం అవుతోంది టీఆర్ఎస్ పార్టీ.. దానికి పార్లమెంట్ సమావేశాలను వేదికగా చేసుకోబోతోంది.. పార్లమెంట్ సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వ వైఖరిని ఎండగట్టాలని గులాబీ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది.. ఇందులో భాగంగా ఇవాళ పార్టీ ఎంపీలకు కీలక సూచనలు, దిశానిర్దేశం చేయనున్నారు గులాబీ బాస్.. పార్లమెంట్ బడ్జెట్ తొలి విడత సమావేశాలు రేపటి నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో.. ఇవాళ మధ్యాహ్నం ఒంటి గంటకు ప్రగతి భవన్‌లో టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం కాబోతోంది.. సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరుగనున్న ఈ భేటీలో.. బడ్జెట్ సమావేశాల్లో లోక్ సభ, రాజ్య సభల్లో టీఆర్ఎస్ పార్టీ అనుసరించాల్సిన వ్యూహం ఖరారు కాబోతోంది..
Read Also: వాహనాలకు రిఫ్లెక్టివ్ టేప్ తప్పనిసరి.. లేదా రూ.10వేలు ఫైన్..!
Also Read
- CM Revanth Reddy : కొండా సురేఖ ఎపిసోడ్‌పై రేవంత్ క్లారిటీ.. కీలక వ్యాఖ్యలు..
- Telangana High Court : కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌పై స్టే ఎత్తివేత.. కానీ..!
- CM Revanth Reddy : ఇది ఫెడరల్ స్ఫూర్తిపై దెబ్బ.. పార్లమెంట్లో పంచాయితీ ఖాయం
- CM Revanth Reddy : కేంద్రంపై సీఎం రేవంత్ ఫైర్.. నన్ను కాదు.. తెలంగాణ ప్రజలనే తిరస్కరించారు
రాష్ట్రంలో అమలు కావాల్సిన పెండింగ్ అంశాలు, కేంద్రం నిధులు సహా.. కేంద్రం నుంచి సాధించాల్సిన పెండింగ్ సమస్యలపై ఎంపీలకు దిశానిర్దేశం చేయనున్నారు సీఎం కేసీఆర్.. తెలంగాణ హక్కులను సాధించుకునేందుకు ఉభయ సభల్లో అనుసరించాల్సిన వ్యూహాలను ఎంపీలకు సూచించనున్నారు. గత పార్లమెంట్ సమావేశాల్లో.. వరి ధాన్యం కొనుగోళ్ల విషయంలో కేంద్రాన్ని నిలదీసింది టీఆర్ఎస్.. ఇప్పుటు మిగతా అంశాలపై ఫోకస్ పెట్టేందుకు సిద్ధం అవుతోంది.. అసలే కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని టీఆర్ఎస్ మధ్య కాస్త గ్యాప్ పెరిగిన నేపథ్యంలోఇవాళ జరగనున్న భేటీలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు అనేది ఆసక్తికరంగా మారింది.
- Tags
- BJP vs TRS
- cm kcr
- kcr
- telangana
- TRS
తాజావార్తలు
-
Komaram: నాతో ఉన్నవాళ్లే 15 మంది డైరెక్టర్లయ్యారు.. కానీ మీరు కొత్త జీవితాన్ని ఇచ్చారు
-
Marriage Rumours: జయరామ్ – సిమ్రాన్ పెళ్లి చేసుకున్నారా? వైరల్ అవుతున్న ఫొటోలు!
-
Sugar Prices: చక్కెర ధరలపై గుడ్‌న్యూస్.. దిగిరానున్న ధరలు
-
CM Revanth Reddy : కొండా సురేఖ ఎపిసోడ్‌పై రేవంత్ క్లారిటీ.. కీలక వ్యాఖ్యలు..
-
Jaishankar-Putin: రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో జైశంకర్ భేటీ.. రెండు దేశాల సంబంధాలపై చర్చ
ట్రెండింగ్
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?
-
50MP కెమెరా, 120Hz AMOLED డిస్‌ప్లే,7,050mAh బ్యాటరీతో Vivo V80 Lite 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
EPFO హెచ్చరిక.. 10 ఏళ్ల సర్వీస్ పూర్తికాకముందే PF విత్‌డ్రా చేస్తే పెన్షన్‌పై ప్రభావం..!
-
IP Ratings: IP67, IP68, IP69 అంటే ఏమిటి? స్మార్ట్‌ఫోన్ కొనేముందు ఈ వాటర్‌ప్రూఫ్ రేటింగ్స్ గురించి తప్పక తెలుసుకోండి.!
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!