January 12 Release టీమ్ బిగ్ స్కెచ్.. క్లైమాక్స్ సీన్లు అదిరిపోయేలా ప్లాన్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
January 12 Release: విక్టరీ వెంకటేష్, నందమూరి కళ్యాణ్‌రామ్ కలిసి నటిస్తున్న క్రేజీ మల్టీస్టారర్ ‘జనవరి 12 విడుదల’పై ఇండస్ట్రీలో భారీ అంచనాలు ఉన్నాయి. వచ్చే సంక్రాంతి పండక్కి థియేటర్లలో జనాన్ని కడుపుబ్బా నవ్వించడమే లక్ష్యంగా దర్శకుడు అనిల్ రావిపూడి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. అయితే తాజాగా ఈ సినిమా క్లైమాక్స్ గురించి ఒక ఆసక్తికరమైన న్యూస్ బయటకు వచ్చింది. ఈ క్లైమాక్స్ సీన్లను ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని ఇచ్చేలా టీమ్ అదిరిపోయే స్కెచ్ వేసిందని తెలుస్తుంది.
నవంబర్ రెండో వారంలో ప్రత్యేకంగా వేసిన భారీ సెట్లో ఈ క్లైమాక్స్‌ను షూట్ చేయడానికి పక్కా ప్లాన్ రెడీ చేశారట మేకర్స్. సాధారణంగా ఏ కమర్షియల్ సినిమాలోనైనా క్లైమాక్స్ అంటే రౌడీలను ఎడాపెడా కొట్టే ఫైట్లు, రొటీన్ యాక్షన్ మాత్రమే కనిపిస్తుంది. కానీ అనిల్ రావిపూడి ఈసారి ఆ పాత రూట్ పక్కనపెట్టేశారని, ఫైటింగ్‌తో పాటు ఆ సన్నివేశాలకు కడుపుబ్బ నవ్వించే కామెడీని యాడ్ చేసి క్లైమాక్స్‌ను సరికొత్తగా డిజైన్ చేశారని చెబుతున్నారు. థియేటర్లలో కూర్చున్న ప్రేక్షకులు సీట్ల నుంచి లేవకుండా పగలబడి నవ్వుకునేలా ఈ యాక్షన్-కామెడీ ఎపిసోడ్స్ ఉంటాయని చిత్ర బృందం సన్నిహిత వర్గాలు పేర్కొంటున్నాయి.
Also Read
ఇందులో వెంకటేష్ ఫుల్ స్టైలిష్ అవతారంలో కనిపించబోతుండగా, ఆయనకు పూర్తి విరుద్ధంగా రస్టిక్ లుక్‌లో కళ్యాణ్‌రామ్ కనిపించనున్నారట. సీరియస్ రోల్స్ చేసే కళ్యాణ్‌రామ్‌తో అనిల్ రావిపూడి ఈసారి పక్కా కామెడీ చేయిస్తుండటం విశేషం. వీరిద్దరి మధ్య వచ్చే సీన్లు, పంచ్ డైలాగులు థియేటర్లలో నవ్వుల జాతర తేవడం ఖాయంగా కనిపిస్తోంది. కీర్తి సురేష్, కృతి శెట్టి హీరోయిన్స్‌గా నటిస్తున్న ఈ చిత్రాన్ని సాహు గారపాటి నిర్మిస్తుండగా, జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. సంక్రాంతి బరిలో ఈ నవ్వుల పండగ బాక్సాఫీస్ వద్ద ఏ రేంజ్లో కలెక్షన్లు కొల్లగొడుతుందో చూడాలి.
తాజావార్తలు
-
January 12 Release టీమ్ బిగ్ స్కెచ్.. క్లైమాక్స్ సీన్లు అదిరిపోయేలా ప్లాన్!
-
US-Iran Conflict: ‘తెలివి ఉంటే దాడి చేయరు’.. ట్రంప్‌కు ఇరాన్ వార్నింగ్!
-
IND W vs ZIM W: హర్మన్‌ప్రీత్, దీప్తి మెరుపు శతకాలు.. జింబాబ్వే ముందు భారీ లక్ష్యం.!
-
8000mAh బ్యాటరీ, 90Hz డిస్ప్లేతో బడ్జెట్ ట్యాబ్లెట్ Honor Pad X10 Mini లాంచ్..!
-
New Feature : లైక్ కొడితే డబ్బులు పంపొచ్చు.. మస్క్ కొత్త ప్లాన్.!
ట్రెండింగ్
-
Smriti Mandhana: కెప్టెన్‌గా తొలి సిరీస్‌లోనే ఎదురుదెబ్బ.. స్మృతి మందాన ఖాతాలో చెత్త రికార్డు..!
-
All-Time India Test XI: ఓ.. డ్యామిట్.. ఆ జట్టులో కూడా కోహ్లీ, రోహిత్‌లకు దక్కని చోటు..!
-
2G ఫోన్‌తోనూ UPI పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే itel 2165Cలో UPI పేమెంట్స్..!
-
How To Make Butter: మార్కెట్లో దొరికే కల్తీ వెన్నకు చెక్.. ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోండిలా..
-
Humanoid Robot : కత్తి దాడినే అడ్డుకుంది.. చైనా రోబో విన్యాసాలు చూస్తే మైండ్ బ్లాక్