TGSRTC: ప్రయాణికులకు ఆర్టీసీ ధమాకా ఆఫర్.. సరికొత్త పథకానికి శ్రీకారం.. కేవలం రూ.600లకే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హైదరాబాద్ నగరవాసులకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) తీపి కబురు అందించింది. ప్రయాణికులకు ప్రయాణాన్ని మరింత సులభతరం, బడ్జెట్ ఫ్రెండ్లీగా మార్చేందుకు ఒక సరికొత్త పథకానికి శ్రీకారం చుట్టింది. నగరం పరిధిలో రాకపోకలు సాగించే వారి కోసం ఆర్టీసీ యాజమాన్యం ప్రత్యేకంగా వీక్లీ పాస్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది.
ఈ నూతన ఆఫర్ ప్రకారం.. కేవలం రూ. 600లకే వారం రోజుల పాటు నగరంలోని క్యూర్ పరిధిలో అపరిమితంగా ప్రయాణించే వెసులుబాటు కల్పించారు. సాధారణ సిటీ బస్సులతో పాటు ఏసీ బస్సులలో కూడా ఈ పాస్‌తో ప్రయాణించవచ్చని ఆర్టీసీ ప్రకటించింది. ప్రతిరోజు ఉద్యోగాలు, వ్యాపారాలు, ఇతర పనుల నిమిత్తం నగరంలో వివిధ ప్రాంతాలకు ప్రయాణించే వారికి ఈ వీక్లీ పాస్ ఎంతో ఆర్థిక ప్రయోజనాన్ని చేకూరుస్తుంది. రోజువారీ ఛార్జీల భారం తగ్గడమే కాకుండా, పదే పదే టికెట్లు తీసుకునే పనిలేకుండా ప్రయాణం ఎంతో సులభతరం అవుతుంది.
Also Read
- Bhumana Karunakar Reddy: నంద్యాల ఘటనలో ప్రధాన నిందితుడిని ఎందుకు అరెస్ట్ చేయలేదు? భూమన ప్రశ్నలు
- INDA vs NZA: మళ్లీ నిరాశ పరిచిన కేఎల్ రాహుల్, యశస్వి జైస్వాల్.. దూకుడు పెంచిన పడిక్కల్, సాయి సుదర్శన్..
- Telangana Rice Mill Scam: రైస్ మిల్లర్ల ‘మాయా’జాలం.. ఖజానాకు భారీ గండి!
- Kashi Cafe Controversy: జిన్నా విగ్రహం, బీఫ్ వ్యాఖ్యలు.. యూట్యూబర్‌పై కేరళ సర్కార్ ఫైర్!
ఈ వీక్లీ పాసులు నగరంలోని అన్ని సిటీ బస్ పాస్ కౌంటర్లలో అందుబాటులో ఉంటాయని ఆర్టీసీ అధికారులు స్పష్టం చేశారు. ప్రయాణికులు తమకు సమీపంలో ఉన్న బస్ పాస్ కౌంటర్లకు వెళ్లి ఈ పాస్‌ను సులభంగా కొనుగోలు చేయవచ్చు. ఆర్టీసీ తీసుకొచ్చిన ఈ ధమాకా ఆఫర్ పట్ల నగర ప్రయాణికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ అవకాశాన్ని ప్రయాణికులందరూ సద్వినియోగం చేసుకోవాలని టీజీఎస్ ఆర్టీసీ యాజమాన్యం కోరింది.
తాజావార్తలు
-
TGSRTC: ప్రయాణికులకు ఆర్టీసీ ధమాకా ఆఫర్.. సరికొత్త పథకానికి శ్రీకారం.. కేవలం రూ.600లకే..
-
Bhumana Karunakar Reddy: నంద్యాల ఘటనలో ప్రధాన నిందితుడిని ఎందుకు అరెస్ట్ చేయలేదు? భూమన ప్రశ్నలు
-
INDA vs NZA: మళ్లీ నిరాశ పరిచిన కేఎల్ రాహుల్, యశస్వి జైస్వాల్.. దూకుడు పెంచిన పడిక్కల్, సాయి సుదర్శన్..
-
Telangana Rice Mill Scam: రైస్ మిల్లర్ల ‘మాయా’జాలం.. ఖజానాకు భారీ గండి!
-
PM Modi: 33 ఏళ్ల క్రితం మరణించిన గురువుతో ప్రధాని మోడీ సంభాషణ.. ఏఐ స్వామి చిన్మయానంద ఏమన్నారంటే?
ట్రెండింగ్
-
Humanoid Robot : కత్తి దాడినే అడ్డుకుంది.. చైనా రోబో విన్యాసాలు చూస్తే మైండ్ బ్లాక్
-
Incredible India : ప్రపంచ రికార్డుల ఖజానా.. భారత్‌లో ఈ ప్రదేశాలు చూశారా.?
-
Spine Health : చిన్న అలవాట్లే వెన్నెముకకు ముప్పు.. మీ పొజిషన్స్ సరిగ్గా లేకపోతే ఇబ్బందే
-
Bottle Gourd Roti Recipe: సొరకాయతో టేస్టీ రోటీలు.. బ్రేక్‌ఫాస్ట్‌కు అదిరిపోయే హెల్తీ రెసిపీ..
-
Shreyas Iyer History: మరో 25 పరుగులే.. మొదటి టీమిండియా కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ చరిత్ర!