KCR Birthday: ఎంపీ సంతోష్ కుమార్ సమర్పణలో స్పెషల్ సాంగ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈనెల 17న తెలంగాణ సీఎం కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా రాజ్యసభ ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సమర్పణలో స్పెషల్ సాంగ్‌ను ఆవిష్కరించారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కో ఫౌండర్ రాఘవ నిర్మాతగా పూర్ణ దర్శకత్వంలో మాట్ల తిరుపతి రచనలో రూపొందించిన ప్రత్యేక గీతాన్ని బంజారాహిల్స్ ఎల్వీ ప్రసాద్ డిజిటల్ ల్యాబ్‌లో హోంమంత్రి మహమూద్ అలీ, ఎంపీ రంజిత్ రెడ్డి ఆవిష్కరించారు.
అనంతరం హోంమంత్రి మహమూద్ అలీ మాట్లాడుతూ.. పాటను చూడగానే సీఎం కేసీఆర్ తెలంగాణ కోసం చేసిన పోరాటాలు గుర్తుకువచ్చాయన్నారు. ఇంత మంచి సాంగ్ రూపొందించినందుకు అభినందనలు తెలియజేశారు. గాంధీ తర్వాత అంతటి గొప్ప నాయకుడు సీఎం కేసీఆర్ అని తెలంగాణ కోసం ఎన్నో ఏళ్ళు శ్రమించి ప్రాణం పోయినా ఫర్వాలేదని తెలంగాణ కోసం కోట్లాడి సాధించారన్నారు. ఇప్పుడు దేశంలోనే తెలంగాణను నంబర్‌వన్‌గా నిలిపారని మహమూద్ అలీ కొనియాడారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారని అన్ని పండుగలు ఘనంగా జరుపుతున్నారన్నారు. రాష్ట్రం రాకముందు కమ్యునల్ గొడవలు ఉండేవి ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదని తాగునీటి, సాగునీటికి ఇబ్బందులు లేవన్నారు.
Also Read
- Saturday Holiday: ఉద్యోగులకు శుభవార్త చెప్పిన ప్రభుత్వం.. ఇక అన్ని శనివారాలు సెలవులే.. తెలంగాణలో..?
- APL: మరో క్రీడా సమరానికి వేదికగా హైదరాబాద్.. అక్టోబర్ 8 నుంచే ప్రారంభం..
- Sangareddy: భార్య సంపాదన పుట్టింటికి ఇస్తోందని కసి.. సుపారీ ఇచ్చి హత్య చేయించిన భర్త!
- DGP CV Anand: "ఇకపై నో ఫ్రెండ్లీ పోలీసింగ్".. వాళ్లను అస్సలు వదలమన్న డీజీపీ సీవీ ఆనంద్
కొత్త ప్రయాణానికి నాంది పలకబోతున్న సీఎం కేసీఆర్‌కు నిండునూరేళ్లు ఆయురారోగ్యాలు కలగాలని టీఆర్ఎస్ ఎంపీ రంజిత్ రెడ్డి ఆకాక్షించారు. ఈ పుట్టినరోజు ప్రత్యేకమైనదని రేపటి నుండి కొత్త భారత నిర్మాణం కోసం అడుగులు వేస్తున్నారని అందరూ వేచిచూస్తున్నారన్నారు. అహర్నిశలు పోరాడి తెలంగాణ తెచ్చి బంగారు తెలంగాణ చేశారని.. ఇప్పుడు భారతదేశంలో ఉన్న సమస్యల పరిష్కారం దిశగా అడుగులు వేస్తున్నారన్నారు. ఇంత మంచి సాంగ్ రూపొందించిన రూపకర్తలకు ఎంపీ రంజిత్ రెడ్డి అభినందనలు తెలియజేశారు.
అనంతరం బోరబండ కార్పొరేటర్ బాబా ఫసియుద్దీన్ మాట్లాడుతూ.. తెలంగాణ సాధించడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నో ఏళ్ళు శ్రమించారన్నారు. ఎందరో అవహేళన చేసిన అన్ని తట్టుకొని అసాధ్యాన్ని సుసాధ్యం చేశారన్నారు. దేశానికి సీఎం కేసీఆర్ నాయకత్వం అవసరం ఎంతగానో ఉందని మతోన్మాద శక్తుల నుండి దేశానికి విముక్తి లభించాలంటే దేశానికి సీఎం కేసీఆర్ నాయకత్వం అవసరమన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయురారోగ్యాలతో ఉండాలని అందరం ప్రార్థిద్దామని బాబా ఫసియుద్దీన్ తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఎస్ఐఐసీ ఛైర్మన్ గ్యాదరి బాలమల్లు, టీఆర్ఎస్ సీనియర్ నేతలు మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి, రామ్మూర్తి, బోరబండ కార్పొరేటర్ బాబా ఫసియుద్దీన్, బిసి కమిషన్ సభ్యుడు కిషోర్ గౌడ్ పాల్గొన్నారు.
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi Next Match: వైభవ్ సూర్యవంశీకి మరో అవకాశం.. ఇప్పుడైనా బ్యాట్‌తో చెలరేగుతాడా..?
-
Pawan Kalyan: ‘పవన్ కళ్యాణ్’ నా పేరు కాదు.. అసలు పేరు చెప్పి షాకిచ్చిన పీకే!
-
Saturday Holiday: ఉద్యోగులకు శుభవార్త చెప్పిన ప్రభుత్వం.. ఇక అన్ని శనివారాలు సెలవులే.. తెలంగాణలో..?
-
Sri Lanka: ఈస్టర్ బాంబు దాడి వెనుక కుట్ర.. శ్రీలంక మాజీ అధ్యక్షుడు, స్పై చీఫ్‌పై సంచలన ఆరోపణలు
-
SS Rajamouli: సింగీతం శ్రీనివాసరావు కోసం రాజమౌళి ఏం చేశారో చూశారా?.. లైవ్ వీడియో కాల్లో జక్కన్న సర్ప్రైజ్!
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్‌తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్‌వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!