తెలంగాణ సీఎం కేసీఆర్ మరోసారి బీజీ కానున్నారు. బీహార్ పర్యటన ఖరారైంది. ఈనెల 31 వ తారీకున బుధవారం ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు బీహార్ పర్యటన చేపట్టనున్నారు. అందులో భాగంగా.. బుధవారం ఉదయం హైదరాబాదు నుండి పాట్నా కు బయలుదేరి వెళ్లనున్నారు. గతంలో ప్రకటించిన మేరకు, గాల్వాన్ ఘర్షణల్లో అమరులైన 5 గురు బీహార్ కు చెందిన భారత సైనికుల కుటుంబాలకు ఆర్థిక సహాయం అందజేయనున్నారు. సైనిక కుటుంబాలతో పాటు..ఇటీవలి, సికింద్రాబాద్ టింబర్ డిపో అగ్ని ప్రమాదంలో చనిపోయిన 12 మంది బీహార్ వలస కార్మికుల కుటుంబాలకు సీఎం కెసిఆర్ ఆర్థిక సాయం అందజేయనున్నారు.
Read Also: Telugu Bhasha Dinotsavam: ‘తెలుగదేల?’ అంటున్న సినీజనం!
బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తో కలిసి సీఎం కేసీఆర్ చెక్కులు పంపిణీ చేయనున్నారు. అనంతరం.. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఆహ్వానం మేరకు, మధ్యాహ్నం లంచ్ కార్యక్రమంలో సీఎం కేసీఆర్ పాల్గొననున్నారు. ఈ సందర్భంగా జాతీయ రాజకీయాలపై ఇరువురు ముఖ్యమంత్రులు చర్చించనున్నారు. జాతీయ రాజకీయాలపై కేసీఆర్ ఆసక్తి కనబరుస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా పెద్దపల్లి సభలోనూ జాతీయ రాజకీయాలకు పోదామా అన్నారు. రైతుసంఘాల నేతలతో భేటీ అంశం ప్రధానంగా చర్చకు వస్తోంది. మోడీ ప్రభుత్వాన్ని గద్దె దించుదామని, బీజేపీ ముక్త్ భారత్ కు అంతా కలిసి రావాలన్నారు కేసీఆర్. రాబోయే రోజుల్లో జాతీయ రాజకీయాలపై మరింతగా ఫోకస్ పెట్టే అవకాశం కనిపిస్తోందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
Read Also: Revanth Reddy:దేశాన్ని కాపాడేందుకు కాంగ్రెస్ జోడో యాత్ర