Site icon NTV Telugu

Telangana Cabinet: బీసీలకు 42 శాతం రిజర్వేషన్లతోనే స్థానిక సంస్థల ఎన్నికలు

Tg Cabinet

Tg Cabinet

Telangana Cabinet: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో జరిగిన రాష్ట్ర కేబినెట్ సమావేశంలో పలు కీలక అంశాలపై నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా పంచాయతీరాజ్ చట్టంలో సవరణలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను స్థానిక సంస్థల ఎన్నికల్లో అమలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. దీనికి సంబంధించిన ఆర్డినెన్స్‌ను త్వరలో జారీ చేయాలని యోచిస్తోంది. ఇదే కారణంగా రాష్ట్ర అసెంబ్లీని ప్రోరోగ్ చేసినట్లు సమాచారం. అలాగే ప్రత్యేక అసెంబ్లీ సమావేశాన్ని నిర్వహించే దిశగా ప్రభుత్వం ఆలోచనలో ఉంది.

Kanipakam Temple: విరిగిన పాలతో అభిషేకం.. స్పందించిన కాణిపాకం ఆలయ ఈవో!

ఇకపై హైకోర్టు ఆదేశాల ప్రకారం, సెప్టెంబర్ 30లోగా స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తిచేయాల్సి ఉంది. ఈ నేపథ్యంలో కేబినెట్‌లో ఈ అంశంపై కూడా కీలక చర్చ జరిగినట్టు తెలుస్తోంది. సమావేశం అనంతరం స్థానిక సంస్థల ఎన్నికలపై స్పష్టమైన ప్రకటన వెలువడే అవకాశం ఉంది.

వర్షాకాలం ప్రారంభమై ఉన్న నేపథ్యంలో, భారీ వర్షాలు, వరదల పరిస్థితులను ఎదుర్కొనడంలో అవసరమైన ముందస్తు చర్యలు, సహాయ చర్యల అమలుపై కూడా ఈ సమావేశంలో సమగ్రంగా చర్చించారు. గత కేబినెట్ సమావేశంలో తీసుకున్న నిర్ణయాల అమలుపై సమీక్షించడంతో పాటు, ఇప్పటికే చేపట్టిన కార్యక్రమాల పురోగతిపై కూడా మంత్రివర్గం సమీక్షించిందని సమాచారం.

Fish Venkat: ఫిష్ వెంకట్ కి హీరో ఆర్థిక సహాయం

Exit mobile version