Telangana Cabinet: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో జరిగిన రాష్ట్ర కేబినెట్ సమావేశంలో పలు కీలక అంశాలపై నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా పంచాయతీరాజ్ చట్టంలో సవరణలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను స్థానిక సంస్థల ఎన్నికల్లో అమలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. దీనికి సంబంధించిన ఆర్డినెన్స్‌ను త్వరలో జారీ చేయాలని యోచిస్తోంది. ఇదే కారణంగా రాష్ట్ర అసెంబ్లీని ప్రోరోగ్ చేసినట్లు సమాచారం. అలాగే ప్రత్యేక అసెంబ్లీ…