ప్రధాని కోసం మృత్యుంజయ హోమాలు.. బీజేపీ పిలుపు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రధాని నరేంద్ర మోడీ పంజాబ్ పర్యటన పెద్ద రచ్చగా మారింది.. రైతుల ఆందోళనతో మార్గమధ్యలో ఇరుక్కుపోయిన ప్రధాని మోడీ.. ఆకస్మాత్తుగా తన పర్యటనను రద్దు చేసుకుని ఢిల్లీకి వెళ్లిపోయారు.. ఈ ఘటనలో పంజాబ్ ప్రభుత్వంపై విమర్శలు మొదలయ్యాయి.. ఉద్దేశపూర్వకంగానే ప్రధాని భద్రత పట్ట నిర్లక్ష్యంగా వ్యవహరించారని పంజాబ్‌లోని కాంగ్రెస్ సర్కార్‌ను టార్గెట్ చేస్తోంది బీజేపీ.. ఇప్పటికే దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో పంజాబ్ సర్కార్‌కు వ్యతిరేకంగా బీజేపీ ఆందోళనలు, నిరసన కార్యక్రమాలు, దీక్షలు చేస్తుండగా.. రేపు రాష్ట్ర వ్యాప్తంగా మృత్యుంజయ హోమాలు నిర్వహించాలని తెలంగాణ బీజేపీ నిర్ణయించింది..
Read Also: కరోనా ఎఫెక్ట్.. సంపూర్ణ లాక్డౌన్..
Also Read
- Rahul Ramakrishna : పవన్ కళ్యాణ్ పై అర్జున్ రెడ్డి యాక్టర్ విమర్శలు
- Kavitha: విద్యాశాఖపై సీఎం పట్టు కోల్పోయారు.. కవిత సంచలన వ్యాఖ్యలు.!
- Bus Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. రైల్వే బ్రిడ్జిని ఢీ కొట్టిన ప్రైవేటు ట్రావెల్స్ బస్సు.!
- CM Revanth Reddy : సైబరాబాద్‌కు రూ.1,858 కోట్ల బూస్ట్.. రేపు సీఎం భారీ శంకుస్థాపనలు
పంజాబ్‌లో ప్రధాని నరేంద్ర మోడీ కాన్వాయ్ ని అడ్డుకోవడంపై ఆందోళన వ్యక్తం చేస్తున్న బీజేపీ శ్రేణులు.. ప్రధాని మోడీ ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు వర్దిల్లాలని మృత్యుంజయ హోమం నిర్వహించేందుకు సిద్ధమైంది.. మండల, జిల్లాలతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా హోమాలు నిర్వహించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సూచించారు.. బీజేపీ రాష్ట్ర, జిల్లా, మండల స్థాయి నేతలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించిన బండి సంజయ్.. రేపు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు హోమం నిర్వహించాలని ఆదేశాలు జారీ చేశారు.. ఇక, హైదరాబాద్ అల్కాపురిలోని శృంగేరి మఠం ఆలయంలో నిర్వహించే మృత్యుంజయ హోమంలో బండి సంజయ్ పాల్గొననున్నారు.. మరోవైపు, పంజాబ్ ఘటనను నిరసిస్తూ రేపు రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో అంబేడ్కర్ విగ్రహాల వద్ద నిరసన కార్యక్రమాలు చేయాలని బీజేపీ రాష్ట్ర నాయకత్వం నిర్ణయించింది.
తాజావార్తలు
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
INDIA Alliance Meeting: విజయ్ పార్టీకి ఊహించని పరిణామం.. టీవీకేను పక్కన పెట్టిన ఇండియా కూటమి?
-
SIP Rules: SIP చేస్తున్నవారిలో చాలామంది పట్టించుకోని కీలక విషయాలు.. దీర్ఘకాలంలో భారీ ప్రభావం!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Rahul Ramakrishna : పవన్ కళ్యాణ్ పై అర్జున్ రెడ్డి యాక్టర్ విమర్శలు
ట్రెండింగ్
-
Birth Rate: భారత్‌లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్‌కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.