కరోనా ఎఫెక్ట్.. సంపూర్ణ లాక్‌డౌన్..

మరోసారి కరోనా మహమ్మారి పంజా విసురుతోంది.. దీంతో కట్టడి చర్యలకు పూనుకుంటున్నాయి ఆయా రాష్ట్రాలు, నైట్‌ కర్ఫ్యూలు, సంపూర్ణ లాక్‌డౌన్‌లు.. ప్రజలు ఎక్కువగా కలుసుకునే అవకాశం ఉన్న విందు, వినోదాలపై ఆంక్షలు.. ఇలా పలు రకాల చర్యలు తీసుకుంటున్నారు.. తమిళనాడు ప్రభుత్వం సంపూర్ణ లాక్‌డౌన్‌ ప్రకటించింది.. ఆదివారం అంటే ఇవాళ ఒక్కరోజు సంపూర్ణ లాక్‌డౌన్‌ అమలు చేస్తున్నారు.. అత్యవసర సేవలు మినహా వేటికీ అనుమతి లేదని ఇప్పటికే ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేశాయి.. అయితే, ఇవాళ ఒకేరోజుకు లాక్‌డౌన్‌ పరిమితం ప్రతి ఆదివారం సంపూర్ణ లాక్‌డౌన్‌ ను అమలు చేయనున్నారు.. ప్రజలు ప్రశాంతంగా ఇళ్లలోనే ఉండాలని సూచిస్తున్నారు పోలీసులు.. శనివారం రాత్రికే అన్ని చెక్‌ పోస్టుల్లోనూ రోడ్లను, వంతెనల్నీ సైతం మూసి వేశారు.

Read Also: థర్డ్‌ వేవ్‌కు కారణం ఒమిక్రాన్..!

మరోవైపు ఇవాళ సంపూర్ణ లాక్‌డౌన్‌ నేపథ్యంలో.. శనివారం అన్ని మార్కెట్లలో రద్దీ కనిపించింది.. మద్యం దుకాణాలు, కాయగూరల మార్కెట్‌లకు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు ప్రజలు.. చేపలు, మాంసం మార్కెట్లు జనంతో కిక్కిరిశాయి. ఇక తమిళనాడులో సగటున రోజుకు 3 వేల వరకు కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు అవుతున్నాయి.. దీంతో.. నైట్‌ కర్ఫ్యూను ప్రకటించిన ప్రభుత్వం.. గురువారం నుంచి నైట్‌ కర్ఫ్యూను అమలు చేస్తోంది.. ఇక, చెన్నైలో కరోనా కట్టడి చర్యల కోసం 15 మంది ఐఏఎస్‌లతోప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు సీఎం స్టాలిన్.

Related Articles

Latest Articles