Telangana BJP: భారత రాజ్యాంగ దినోత్సవం నాడు తెలంగాణ బీజేపీ ఆసక్తికర పోస్ట్

  • భారత రాజ్యాంగం దినోత్సవం సందర్భంగా తెలంగాణ బీజేపీ ఆసక్తికర పోస్ట్..
  • రాజ్యాంగ విలువలను ప్రధాని మోడీ అనుక్షణం కాపాడుతున్నారని వెల్లడి..
  • ఆర్టికల్ 370 రద్దు రాజ్యాంగ పరిరక్షణలో భాగమే: తెలంగాణ బీజేపీ
Tg Bjp Office

Tg Bjp Office

Telangana BJP: భారత రాజ్యాంగ దినోత్సవం నాడు తెలంగాణ బీజేపీ ఓ ఆసక్తికర పోస్ట్ చేసింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ రాజ్యాంగ విలువలను అనుక్షణం కాపాడుతున్నారని చెప్పుకొచ్చింది. రాజ్యాంగాన్ని గౌరవాన్ని కాపాడుతూ మోడీ ప్రజా యోగ్యమైన పాలన కొనసాగిస్తున్నారని తెలిపారు. సత్యమేవ జయతే నినాదమే ఊపిరిగా సదా రాజ్యాంగ రక్షణలో నరేంద్ర మోడీ అంటూ పేర్కొనింది. న్యాయ వ్యవస్థలో మార్పులు, ఆర్టికల్ 370 రద్దు రాజ్యాంగ పరిరక్షణలో భాగమేనని తెలంగాణ భారతీయ జనతా పార్టీ వెల్లడించింది.

Read Also: Ram Gopal Varma: రామ్‌గోపాల్‌ వర్మ బెయిల్‌ పిటిషన్లపై విచారణ వాయిదా!

ఇక, రాజ్యాంగ హక్కులను గౌరవిస్తూ నారీ శక్తి బిల్లు పరిష్కరణ, రాజ్యాంగ బద్ధంగానే ట్రిపుల్ తలాక్ సమస్యకు సమాధానం కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందని తెలంగాణ బీజేపీ తెలిపింది. అలాగే, రాజ్యాంగానికి లోబడే అయోధ్య రామ మందిర వివాదానికి చెక్ పెట్టినట్లు పేర్కొన్నారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ మనకు అందించిన భారత రాజ్యాంగంలో పొందుపర్చిన విలువలను నిలబెట్టడానికి నా జీవితంలో ప్రతి క్షణం అంకితం చేస్తానని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ చెప్పిన మాటలను తెలంగాణ బీజేపీ ఎక్స్‌లో ఈ రోజు (మంగళవారం) పోస్ట్ చేసింది.