అవినీతిపరులు ఓడిపోతారు.. ఈటల గెలుస్తారు-తరుణ్ చుగ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణలో రానున్న ఎన్నికల్లో సీఎం కేసీఆర్ వంశస్థులు… అవినీతిపరులు ఓడిపోతారని వ్యాఖ్యానించారు బీజేపీ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ తరుణ్ చుగ్.. హుజురాబాద్ ఉప ఎన్నికల్లో కమలం, కేసీఆర్ అహంకారంని అణిచి వేస్తుందన్న ఆయన.. తెలంగాణ ప్రజలు, కేసీఆర్ ఆహంకారానికి మధ్య జరుగుతున్న పోరు ఇదిగా అభివర్ణించారు.. కేసీఆర్ రైతులను.. యువకులను మోసం చేశారని ఆరోపించిన తరుణ్ చుగ్.. కేసీఆర్ అహంకారం దిగుతుంది.. ఈటల రాజేందర్ గెలుస్తాడని ధీమా వ్యక్తం చేశారు.. తెలంగాణలో వారసత్వ రాజకీయాలను అంతం చేస్తామని ప్రకటించిన ఆయన.. హుజురాబాద్‌లో కమల వికాసం ఖాయం అని జోస్యం చెప్పారు.. ఇక, వ్యాక్సినేషన్ సెంటర్ల వద్ద లైన్ ఉంది.. మందులేదు అంటూ వార్తలు వస్తాన్నాయని మండిపడ్డారు.. నేటి నుంచి 18 ఏళ్లు పైబడినవారికి ఉచిత వ్యాక్సినేషన్ ఇస్తామన్న తరుణ్ చుగ్.. 31 డిసెంబర్ నాటికి 200కోట్ల డోసులు అందుబాటులో ఉంచుతామని.. ప్రతి ఒక్కరూ వ్యాక్సినేషన్ వేయించుకోవాలని సూచించారు.. కరోనాను జయించేందుకు ప్రధాని నరేంద్ర మోడీ వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభించారన్న ఆయన.. ప్రతి ఒక్కరూ కరోనా సోకకుండా ఉండేందుకు మాస్క్ ధరించాలి.. భౌతిక దూరం పాటించాలన్నారు.
Also Read
తాజావార్తలు
-
Tamil Nadu: కాంగ్రెస్ ద్రోహం చేసింది, విజయ్‌తో చేతులు కలిపేది లేదు: డీఎంకే.
-
KTR : నీళ్లు అడిగితే నెత్తురు చల్లుతావా.. రక్త పిశాచీ.?
-
US-Iran War: ప్రభుత్వం vs మిలిటరీ.. హార్ముజ్ అంశంపై ఇరాన్లో అంతర్గత విభేదాలు..
-
Nithiin: టాలీవుడ్లో సరికొత్త కాంబినేషన్.. నితిన్, రుక్మిణి వసంత్‌ను కలుపుతున్న నాని!
-
Earthquake: బంగాళాఖాతంలో 4.5 తీవ్రతతో భూకంపం.. ఆంధ్రలో ప్రకంపనలు..
ట్రెండింగ్
-
Team India Coach: టీమిండియా కోచింగ్ స్టాఫ్ నుంచి ఒకరు అవుట్.. నెక్స్ట్ ఎవరు?.. భారీ ప్రక్షాళన తప్పదా?
-
Shreyas Iyer: ఆ తప్పిదాలే మా కొంపముంచాయి.. చాలా చెత్తగా ఆడాం.. ఓటమిని నిజాయితీగా ఒప్పుకున్న శ్రేయస్!
-
Kitchen Tips : ఇనుప పాత్రల తుప్పుకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Best Jobs: బాస్ తిట్లు, డెడ్లైన్ల ప్రెజర్ లేవు.. మంచి ప్యాకేజీలతో పాటు పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చే బెస్ట్ జాబ్స్ ఇవే గురూ..
-
అబ్బో.. BSNL ప్లాన్ మాములుగా లేదుగా.! 5TB డేటా, 200Mbps స్పీడ్, ఫ్రీ OTTలు..