Konda Surekha : ఖర్గే, రాహులకు మంత్రి కొండా సురేఖ లేఖ
- కులగణన కోసం కీలక నేతల శ్రమ – ప్రత్యేక ధన్యవాదాలు
- బీసీ హక్కుల పరిరక్షణలో కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయం
- తెలంగాణలో బీసీ కులగణన విజయవంతం : కొండా సురేఖ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Konda Surekha : కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, ఏఐసీసీ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీకి తెలంగాణ రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ గురువారం లేఖ రాశారు. ఇందులో ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ కులగణనను విజయవంతంగా చేపట్టిందని స్పష్టం చేశారు. తెలంగాణలో బీసీల హక్కులను పరిరక్షించేందుకు, వారికి మరింత న్యాయం జరిగేలా ఈ సర్వే ఎంతో ఉపయోగపడుతుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
బీసీ కులగణనను కార్యరూపంలోకి తెచ్చేందుకు రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి దీపాదాస్ మున్షీ, క్యాబినెట్ సబ్ కమిటీ చైర్మన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, టీపీసీసీ చీఫ్ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ కీలకంగా పనిచేశారని మంత్రి కొండా సురేఖ పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి కట్టుబడి ఉందని, కామారెడ్డి డిక్లరేషన్‌లో పొందుపరిచిన ప్రకటనల ప్రకారం ఈ బీసీ సర్వేను విజయవంతంగా అమలు చేయడం ఇందుకు నిదర్శనమని తెలిపారు.
Also Read
Accident : పెద్దఅంబర్ పేట్లో విషాదం.. బస్సు కిందపడి చిన్నారి మృతి
కాంగ్రెస్ జాతీయ నాయకత్వం ఈ మొత్తం ప్రక్రియలో ప్రభుత్వానికి పూర్తి మద్దతుగా నిలిచిందని, పార్టీ అధినేతలు అందించిన సహాయ సహకారాలతోనే ఈ భారీ సర్వే చేపట్టగలిగామని కొండా సురేఖ అభిప్రాయపడ్డారు. బీసీ ప్రజలకు ఈ సర్వే ద్వారా మరింత న్యాయం చేయడానికి అవకాశం లభిస్తుందని, వారి సంక్షేమానికి ఇది ఓ కీలక ముందడుగుగా నిలుస్తుందని పేర్కొన్నారు. రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన ఈ చర్యకు దేశవ్యాప్తంగా గుర్తింపు లభించాల్సిన అవసరం ఉందని చెప్పారు.
ఈ నేపథ్యంలో కాంగ్రెస్ జాతీయ నాయకత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపిన కొండా సురేఖ, ఈ సర్వే విజయవంతం చేయడంలో సహకరించిన ఏఐసీసీ అగ్రనేతలకు వేర్వేరుగా లేఖలు రాశారు. రాష్ట్రంలో బీసీ సంక్షేమానికి కాంగ్రెస్ పార్టీ తీసుకుంటున్న ఈ చర్యలు బలమైన ప్రజాస్వామ్య విలువలకు ప్రతీకగా నిలుస్తాయని పేర్కొంటూ, భవిష్యత్తులో మరిన్ని సంక్షేమ చర్యలు చేపడతామని స్పష్టం చేశారు.
Mahindra XUV400 : బంఫర్ ఆఫర్.. ఈ మహీంద్రా ఎలక్ట్రిక్ కారుపై ఏకంగా 4లక్షల తగ్గింపు!
తాజావార్తలు
-
The Paradise: నాని ‘ది ప్యారడైజ్’ టికెట్ రేట్ల భారీ పెంపు.. అసలు నిజమిదే!
-
Agni veer Rally: సైనిక కల కల్లైంది.. విశాఖ అగ్నివీర్ ర్యాలీలో విషాద ఛాయలు..
-
Tarique Rahman: బ్రిక్స్‌కు దూరం.. యూఎన్ భేటీకి న్యూయార్క్ వెళ్తున్న తారిఖ్ రెహమాన్
-
Erravalli Case : ఎర్రవల్లి పసుపు నీళ్ల వివాదంలో ప్రభుత్వానికి షాక్
-
ICC Rankings: ఆసియా కప్ దెబ్బకు ఐసీసీ ర్యాంకింగ్స్ తారుమారు.. టాప్‌లోకి దూసుకెళ్లిన ఇండియన్ ప్లేయర్స్..
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?