Konda Surekha : కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, ఏఐసీసీ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీకి తెలంగాణ రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ గురువారం లేఖ రాశారు. ఇందులో ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ కులగణనను విజయవంతంగా చేపట్టిందని స్పష్టం చేశారు. తెలంగాణలో బీసీల హక్కులను పరిరక్షించేందుకు, వారికి మరింత న్యాయం జరిగేలా ఈ సర్వే ఎంతో ఉపయోగపడుతుందనే అభిప్రాయాన్ని వ్యక్తం…